కావలసినవి

మామిడిపండ్లు-3 ( చెక్కుతీసి ముక్కలుగా కోసుకోవాలి)

చక్కెర - ముప్పావు కప్పు

నిమ్మరసం - 2 చెంచాలు

క్రీమ్ - 1 కప్పు

పాలు - ముప్పావు కప్పు

తయారీ

మామిడి ముక్కలు, పావు కప్పు చక్కెర, నిమ్మరసం కలిపి మెత్తని గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో క్రీమ్, పాలు, మిగిలిన చక్కెర కలిపి ముందు చేసుకున్న గుజ్జులో పోసి కలుపుకుని గంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ముందురోజు రాత్రి నుంచి డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఐస్ క్రీం మేకర్లో ఈ మిశ్రమాన్ని పోసి గడ్డకట్టే వరకు ఉంచి ఫ్రిజ్ లోపల ఉంచి తీసి మామిడి ముక్కలతో వడ్డించుకోవాలి.

 



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక పూర్ణిమ విశేషాలు

నేడు కార్తీక పౌర్ణమి. శివుడికి మహాశివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమే. ఈ రోజునే పరమేశ్వరుడు 

MORE