కావలసిన పదార్థాలు

 9 రకాల ఉడికించిన కూరగాయ ముక్కలు - 3 కప్పులు( గోరు చిక్కుడు, సొరకాయ, పచ్చి బటాణీ, క్యారెట్, బంగాళా దుంప,కాలీఫ్లవర్, బీన్స్, కాప్సికం,)

టమాటాలు-3, పనీర్ తరుగు-150 గ్రాములు, అల్లం, వెల్లుల్లి మిశ్రమం- చెంచాన్నర చొప్పున, 2 ఉల్లిపాయల తరుగు, పసుపు- చెంచా, కారం- చెంచాన్నర, గరం మసాలా2 చెంచాలు, ధనియాల పొడి-చెంచా, మీగడ- 2 చెంచాలు, నెయ్యి- చెంచా, నూనె- తగినంత, పాలు- కప్పు, డ్రై ఫ్రూట్స్- అర కప్పు, కొత్తిమీర- చెంచా

తయారీ

ముందుగా టమోటాలను ఉడికిచుకొని ఆరనిచ్చి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. తర్వాత మూకుడులో నెయ్యి వేసుకొని ఓ మాదిరి సెగ మీద డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కనబెట్టుకోవాలి. మరోమూకుడులో నూనె తీసుకొని వేడి చేసి అందులో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి మిశ్రమం వేసి దోరగా వేయించి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి మరో మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత అందులో టమోటా గుజ్జు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి, పాలు పోసి 5 నిమిషాలపాటు ఉడకనివ్వాలి. తగినంత ఉడికాక అందులో పనీర్ తరుగు వేసి బాగా కలిపి చివరగా 9 రకాల కూరగాయ ముక్కలు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లుకొని దించితే రుచికరమైన నవరతన్ కుర్మా రెడీ అయినట్లే. ఇది రోటీ, చపాతీ, పులావ్ లోకి  అద్భుతంగా ఉంటుంది.



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

నవరాత్రులు.. నవ నైవేద్యాలు

దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన విశేష ఫలాన్నిస్తుంది. ఆరాధనా విధిని అనుసరించి ఈ 9 రోజులూ వివిధ నైవేద్యాలను అమ్మవారికి 

MORE