ఎండాకాలంలో వేడి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు సబ్జా గింజలు ఉపయోగపడతాయని మనకు తెలుసు. వీటినే 'రుద్రజడ' గింజలు అని కూడా  అంటారు. వీటిలోని సుగంధ తైలాల కారణంగా ఈ గింజలు అన్ని కాలాల్లో వచ్చే పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. ఆ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపయోగాలు

 • అంటువ్యాధులు.. మరీ ముఖ్యంగా అమ్మవారు పోసినప్పుడు నానబెట్టిన సబ్జా గింజలను కొబ్బరి నీళ్ళతో తాగిస్తే మంచి ఫలితం వుంటుంది.
 • గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడినవారు సబ్జా గింజలు నానబెట్టిన నీరు తాగితే సమస్య తీవ్రత తగ్గుతుంది.
 • సబ్జా గింజల్లో ఉండే బోలెడంత పీచు కారణంగా అజీర్తి బాధితులు నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం ,పంచదార కలిపిన నీరు తాగితే సమస్య దూరమై, సుఖ విరేచనం అవుతుంది.
 • బరువు తగ్గాలనుకునే వారు భోజనానికి కాస్త ముందు గ్లాసు నీళ్లలో సబ్జా గింజలను వేసుకుని తాగితే కడుపు నిండిన భావన కలిగి పరిమితంగా ఆహారం తీసుకుంటారు . అలాగే రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు సబ్జా గింజలు నాన బెట్టిన నీరు తాగితే శరీరం లో  వ్యర్దాలు తొలగి, అదనపు కేలరీలు కరిగి బరువు తగ్గుతారు. 
 • సబ్జా నీళ్లు తాగే మహిళల్లో రోగనిరోధక శక్తి పెరగటమే గాక తగినంత ఐరన్, ఫోలేట్ , నియాసిన్, విటమిన్ ఇ లభిస్తాయి. 
 • ఈ గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.
 • టైప్2 మధుమేహ బాధితులు సబ్జా గింజలు వాడితే సమస్య అదుపులోకి వస్తుంది.
 • ఈ గింజల్ని నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాస్తే త్వరగా మానతాయి.
 • క్రీడాకారులు రోజూ ఈ గింజలు తీసుకుంటే శరీరంలో తేమ తగ్గి నీరసించటమనే సమస్య రాదు. 
 • సబ్జా గింజల‌ను రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది.
 • సబ్జా గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల ఆర్థరైటిస్, చర్మ, హృదయ సంబంధిత సమస్యలు రావు.Recent Storiesbpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

శరన్నవరాత్రి వైశిష్ట్యం 

ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు 

MORE