కొన్ని రకాల అల్పాహారాలను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. అలాంటి వాటిలో ఇడ్లీ ఒకటి. తగినన్ని పోషకాలతోబాటు సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీ పేరు వినగానే కొందరు పిల్లలు చిరాగ్గా మొహం పెడతారు. మరికొందరైతే అసలే వద్దంటూ తేల్చి పారేస్తారు. అయితే రోజూ చేసే ఇడ్లీనే కాస్త విభిన్నంగా చేసిపెట్టగలిగితే ఇడ్లీ అంటే ఏ మాత్రం ఇష్టపడని వారు సైతం ఏ వంకా పెట్టకుండా తినేస్తారు. అదెలాగో చూద్దాం. 

  • ఒక్కో ఇడ్లీని 5 ముక్కలుగా చేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడెక్కగానే చెంచాడు సంబారుకారం, తగినంత ఉప్పు వేసి కలిపి చివరగా ఇడ్లీ ముక్కలను వేసి ముక్కలు చిడమకుండా తిప్పి వేడి వేడిగా వడ్డించాలి. 
  • ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి,కొత్తిమీర తరుగు కలిపి ఇడ్లీ వేసి నెయ్యితో వడ్డిస్తే పిల్లలు వద్దనకుండా తింటారు. 
  • ఇడ్లీ పిండిలో తాజా కారట్ తురుము వేసి కలిపి వేస్తే ఇడ్లీ వేస్తే కారట్ ఇడ్లీ రెడీ. ఆకర్షణీయమైన రంగు, కారణంగా పిల్లలు దీన్ని తప్పక ఆస్వాదిస్తారు. 
  • ఇడ్లీలను చేతితో చిదిమి పెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి తాలింపు వేసి అందులో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేయించి గుప్పెడు కారట్ తురుము వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. ఈ తాలింపులో ఇడ్లీ మిశ్రమం, తగినంత ఉప్పు, ఒక నిమ్మ చెక్క కలిపి వేడి వేడిగా వడ్డిస్తే పిల్లలు తప్పక తింటారు. 
  • మినప్పిండి, జొన్నరవ్వ వేసి కలిపి చేసే జొన్న ఇడ్లీ కూడా రుచిగా ఉంటుంది. మినప్పప్పు 4 గంటలు నానబెట్టి రుబ్బి ఆ పిండిలో 10 నిమిషాలు నానబెట్టి కడిగిన జొన్నరవ్వను కలిపి రాత్రంతా పులవనిచ్చి ఉదయం ఇడ్లీ వేసుకుని వేడిగా, చట్నీతో తింటే బలే రుచిగా ఉంటుంది. (1 కప్పు మినప్పప్పుకు , 2 కప్పుల జొన్న రవ్వ) 
  • ఎప్పుడూ చట్నీతో కాకుండా కొద్దిగా చక్కెర, కొబ్బరి కారం, సంబారు కారం వంటివాటితో కాస్త వేడి నెయ్యి కలిపి వేడిగా ఇడ్లీ తింటే చాల రుచిగా ఉంటుంది. 
  • ఇడ్లీ పిండి మిగిలితే వృధాగా పడేయకుండా కొంచెం మైదా కలిపి ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి నూనెలో పునుగులు వేసుకుంటే మెత్తగా,రుచిగా ఉంటాయి. కరకరమంటే బాగుండనుకునే వారు పిండిలో కాస్త బొంబాయి రవ్వ వేస్తే సరి. Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE