కాకర రుచికి చేదైనా ఆరోగ్యానికి అమృతప్రాయం. పైగా ఈ సీజన్లో మార్కెట్లో బోలెడన్ని రకాల కాకరగాయలు దొరుకుతాయి. అలాగని ఎప్పుడూ కాకరగాయ పులుసు, వేపుడు, కూర వంటివే గాకుండా వెరైటీగా చిప్స్ రూపంలోనూ చేసుకోవచ్చు. కూర,వేపుడు తినటానికి ఇష్టపడని వారు సైతం చిరుతిండిగా ఈ చిప్స్ ఇష్టంగా తింటారు. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.

కావలసినవి

కాకరకాయలు - పావుకేజీ

మిరియాలపొడి - అరచెంచా

పుదీనా తరుగు - చెంచా

కరివేపాకు - 2 రెమ్మలు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - వేపుడుకు తగినంత

నిమ్మకాయ - 1 

చేసే పద్ధతి

కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చక్రాల్లా తరగాలి. ఒకగిన్నెలో నిమ్మరసం పిండి, ఉప్పు కలిపి ఈ కాకరగాయ ముక్కల్ని అందులో వేసి కలిపి తీసి గంటన్నర పాటు మంచి ఎండలో ఎండనివ్వాలి. ముక్కలు ఎండకు వాడిన తర్వాత వాటిని మూకుడులో కాచిన నూనెలో గుప్పెడు గుప్పెడు చొప్పున వేసి వేయించి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పుదీనా ఆకుల్ని నూనెలో కరకరలాడేలా వేయించి కాకరగాయ ముక్కలమీద వేసి కలుపుకోవాలి. చాలి. చివరగా కాకరకాయ చిప్స్ మీద మిరియాలపొడి, చల్లుకోవచ్చు. ఎండాకాలంలో ఒకేసారి ఎక్కువ ముక్కలను ఎండబెట్టుకొని డబ్బాలో నిల్వచేసుకోగలిగితే ఏడాదిపొడవునా బుద్ధిపుట్టినప్పుడల్లా కాసిని వేయించుకు తినొచ్చు .



Recent Stories







bpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE