కుటుంబ, వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఆధునిక మహిళ ఎన్నో అనారోగ్యాల పాలవుతోంది. వీటిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. జీవనశైలి మార్పులు, ఆహారపుటలవాట్లు వంటి కారణాల మూలంగా పట్టణ ప్రాంత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ముందు నుంచే ఈ సమస్య పట్ల సరైన అవగాహన, మంచి ఆహార, జీవన శైలి అలవాట్లను అలవరచుకొంటే మహిళలు ఈ మహమ్మారి బారినుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఈ క్రమంలో బ్రెస్ట్ కేన్సర్ నివారణకు దోహదపడే సహజ సిద్దమైన ఆహారపు వివరాలు గురించి తెలుసుకుందాం.  

  • రోజుకు కనీసం 2 కప్పుల చల్లని లేక వేడి గ్రీన్ టీ తాగితే బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తక్కువవుతుంది.
  • వారానికి కనీసం రెండుసార్లు పాలకూర తినేవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు సగం తగ్గినట్లే.
  • బీటా కెరొటిన్ ఉన్న హారం తీసుకునే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తక్కువ. లేత క్యారట్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. అందుకే రోజూ 2 లేత క్యారెట్లు తినాలి.
  • చెర్రి పండ్లలోని ఒక రసాయనం బ్రెస్ట్ క్యాన్సర్‌ని నిరోధిస్తుంది. అందుకే సలాడ్, జ్యూస్ లలో చెర్రీ పండ్లకు స్థానం కల్పించాలి. 
  • వెల్లుల్లికి క్యాన్సర్ కణాల్ని సమర్ధవంతంగా నిరోధించే శక్తి ఉంది. వెల్లుల్లిని నేరుగా వాడటం కంటే పొట్టుతీసి తరిగి 10 నిమిషాల తర్వాత వాడుకుంటే మరింత సమర్ధవంతంగా  కేన్సర్ కణాలను అడ్డుకొంటుంది.
  • విటమిన్ డి లోపం ఉన్న మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ. అందుకే రోజూ కాసేపు సాయంత్రపు ఎండలో తిరగటం, విటమిన్ డి అందించే ఆహారం తప్పక తీసుకోవాలి.
  • టమోటాల్లోని లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే వంటల్లో టమాటా వినియోగం పెంచాలి.
  • ముతక ధాన్యం( పాలిష్ పట్టనివి) తినే మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తక్కువ. అందుకే ముడి బియ్యం, గోధుమలు వాడటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE