• ఒక అరటి పండు తింటే 3 యాపిల్ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్లు తిన్నట్లే.
 • 150 గ్రాముల మటన్, 400 గ్రాముల పాలలో ఎంత విటమిన్ ఎ ఉంటుందో ఒక అరటి పండులో అంత విటమిన్ ఏ లభిస్తుంది.
 • ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అరటి ద్వారా అందే పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది.
 • బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్‌ డిశ్ఛార్జ్‌ సమస్య దూరం అవుతుంది.
 • అరటి పువ్వును ఉడికించి పెరుగుతో కలిపి తింటే రుతు సమయంలో కలిగే నొప్పి, రక్తస్రావం తగ్గుతాయి.
 • కాలిన గాయాల మీద అరటిపండు గుజ్జు రాస్తే త్వరగా నయమవుతాయి. మచ్చలు కూడా పడవు.
 • బలహీనంగా ఉన్న పిల్లలకు పాలు, తేనెతో పాటు అరటిపండు తినిపిస్తే తగినంత బరువు పెరుగుతారు.
 • క్రీడాకారులు, కఠినమైన వ్యాయామాలు చేసే వారు అరటిపండు తింటే త్వరగా నీరస పడరు.
 • వేవిళ్లతో బాధపడే గర్భిణులకు అరటి పండు తినిపిస్తే తగినంత శక్తితోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది.
 • కడుపులోని అల్సర్లను మాన్పటంతో బాటు అజీర్తి సమస్యను అరటి తోడ్పడుతుంది.
 • అరటిలోని పొటాషియం, మెగ్నీషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచి  రక్తపోటును నియంత్రిస్తాయి.
 • సోరియాసిస్ కారణంగా పొడిబారిన చర్మం మీద అరటితొక్కతో రుద్దితే చర్మానికి తగినంత తేమ చేకూరి దురద తగ్గుతుంది.
 • దోమ కుట్టిన చోట అరటితొక్క తో రుద్దితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 • నిద్రలేమి బాధితులు రాత్రి పడుకోబోయే ముందు పాలతోపాటు అరటి పండు తింటే కంటినిండా నిద్రపడుతుంది.
 • నోటిపూత సమస్య ఉన్నప్పుడు 25 గ్రాముల అతి మధురం అరటి గుజ్జుతో తీసుకుంటే నోటి పూత తగ్గుతుంది.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE