ఉసిరి గురించి తెలియని వారు గానీ ఉసిరి చెట్టులేని ఊరు గానీ మనదేశంలో కనిపించవు. ఆరోగ్యంతో బాటు సౌందర్య పరిరక్షణలోనూ ఉసిరిది విశిష్టమైన స్థానం. దేవతా వృక్షాల జాబితాలో ఉసిరి చెట్టుకూ స్థానం ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించటం, ఆ చెట్టు నీడన వన భోజనం చేయటం భారతీయుల సంప్రదాయం. లెక్కకుమించిన ఔషధగుణాలున్న ఉసిరి విశేషాలను తెలుసుకుందాం.

ఆరోగ్య పరిరక్షణలో..

 • రోజూ 1 ఉసిరి పండు తింటే శరీరానికి కావలసిన విటమిన్ సి అందుతుంది. ప్రతి 100 గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల విటమిన్ ‘సి’ ఉంటుంది. నారింజ పండుతో కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. శరీరాన్నిఎండ వేడిమి, అలసట నుంచి కూడా కాపాడుతుంది.
 • ఉదరంలో రసాయనాలను సమతుల్యం చేయటం ద్వారా శరీరాన్ని చల్లబరచి మల మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా దోహదపడుతుంది. ఉసిరి రసానికి ఏలక్కాయ పొడిని కలిపి తీసుకుంటే మూత్ర పరిమాణం పెరుగుతుంది.
 • మధుమేహులకు ఉసిరిని మించిన ఔషధం లేదు. పచ్చి ఉసిరికాయ రసం లేదా ఎండు ఉసిరి చూర్ణంలో చిటికెడు పసుపు, 1 గ్రాము తేనె కలిపి రోజూ తీసుకుంటే సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. లేదా ఉసిరి రసం, కాకర కాయ రసాలను 2 చెంచాల చొప్పున తీసుకున్నా మధుమేహం దారికొస్తుంది.
 • రోజూ ఉసిరి పండు రోజూతినటం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్ తగినంతగా ఉత్పత్తై ఆహారం పూర్తిగా, సులభంగా జీర్ణమవుతుంది.ఉసిరిలో అధికమొత్తంలో ఉండే పీచు కారణంగా పేగు కదలికలు సులభమై, మలబద్దకం వంటి సమస్యలు దరిజేరవు. కాలేయపు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
 • కంటి చూపు సమస్యలతో బాధపడేవారు చెంచా ఉసిరి రసాన్ని, అర చెంచా తేనెతో ఉదయం తీసుకుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • ఆయుర్వేదం సూచించే చ్యవన ప్రాశ లేహ్యంలో ప్రధాన పదార్ధం ఉసిరి పండు గుజ్జే. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు, దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా పోషకాలు ఉసిరిలో లభిస్తాయి.
 • లైంగిక సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
 • గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏర్పడే అడ్డంకుల్ని తొలగించి హృద్రోగాలను నివారిస్తుంది.

సౌందర్య పోషణలో ఉసిరి

 • నల్లని, బలమైన, ఒత్తైన కురులు కోరుకునేవారు ఎండిన ఉసిరి గింజల పొడిని కొబ్బరి నూనెలో బాగా మరిగించి, ఆరనిచ్చి.. దాన్ని రోజూ మాడుకు పట్టిస్తే జుట్టు బలపడుతుంది.  చుండ్రు కూడా రాదు.
 • ఉసిరి కాయ రసంలో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి కాంతిని, నిగారింపును తెస్తాయి. చిన్న వయసులో వచ్చే వృద్ధాప్య లక్షణాలు కూడా దూరమవుతాయి.
 • ఉసిరిపండ్ల రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారైన చీము పొక్కులు తగ్గుతాయి. ఉసిరిపొడి, వేపాకు పొడిని కలిపి ఉదయం పూట తీసుకుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న చర్మవ్యాధులు తగ్గుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE