శరీర పోషణకు ఇతర పోషకాలు ఎంత అవసరమో  కొవ్వులూ అవసరం. అయితే ఊబకాయం తదితర సమస్యల దృష్ట్యా ఇప్పుడు చాలామంది కొవ్వు పదార్థాలు తీసుకోవటం బాగా తగ్గిస్తున్నారు. దీనివల్ల కనీస స్థాయిలో కొవ్వులు అందని పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యకు కుసుమ నూనె ఒక మేలైన పరిష్కారం. మన దేశం మొదలు 60కి పైగా  దేశాల్లో సాగులో ఉన్న కుసుమలను ఆంగ్లంలో శాఫ్‌ ఫ్లవర్‌ అని పిలుస్తారు. విశిష్టమైన ఔషధ గుణాలున్న కుసుమల నుంచి తీసే నూనె  ఊబకాయ సమస్యకు చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. కుసుమ నూనెను వంటకు, సౌందర్య పోషణలో, వైద్య విధానాల్లో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా వేపుళ్లకు, సలాడ్‌ డ్రెసింగ్‌కు వాడుతారు. ఎండిన కుసుమ పువ్వులను హెర్బల్ టీ పొడిలో కలిపి వాడుతారు.  వంటకాల రంగు నిమిత్తం వాడే కుంకుమ పువ్వు కంటే చౌకగా లభిస్తుంది గనుక కుసుమ పువ్వును దానికి ప్రత్యామ్నాయంగా వాడతారు. కుసుమ నూనె ప్రత్యేకతలు, ఉపయోగాల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి 100 గ్రాముల కుసుమ నూనెలో:

కొవ్వులు                -    38గ్రా

శాచురేటెడ్‌ ఫ్యాట్‌       -    3.7గ్రా

పాలీశాచురేటెడ్‌ ఫ్యాట్‌  -    28గ్రా

మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ -   4.8గ్రా

సోడియం                -      3గ్రా

పొటాషియం             -     687మి.గ్రా

కార్బొహైడ్రేట్స్‌           -       34గ్రా

ప్రొటీన్‌                   -       16గ్రా

విటమిన్‌ బి12          -       88శాతం

 ఆరోగ్య ప్రయోజనాలు

  • వేరుశెనగ వంటి ఇతర వంట నూనెల మాదిరిగా శరీరంలో కొవ్వును పెంచక పోగా ఉన్న కొవ్వును కరిగించటం దీని ప్రత్యేకత. అందుకే ఊబకాయులు, అధిక బరువున్న వారు రోజూ కుసుమ నూనె వాడటం వల్ల సన్నబడతారు.
  • కుసుమ నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటిఆక్సిడెంట్స్‌, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వంటకు కుసుమ నూనె వాడుకుంటే శరీరంలో అధిక కొవ్వు చేరదు. హృదయ సంబంధిత సమస్యలూ రావు.
  • రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణమున్న కుసుమ నూనె వినియోగం వల్ల మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది.

గమనిక: కుసుమ నూనెను అతిగా వాడినప్పుడు అది  కొలెస్ట్రాల్‌ను కాలేయంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంది. అందుకే దీనిని పరిమితంగానే వాడటం మంచిది. Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE