డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలది ప్రత్యేక స్థానం. రంజాన్ ఉపవాస దీక్ష ముగించాలన్నా, ఏదైనా వ్రతం చేసుకోవాలన్నా ఖర్జూరం తప్పనిసరి. అయితే గట్టిగా ఉండటం వల్ల వృద్దులు , జీడిపప్పు వంటి రుచి లేకపోవటం వల్ల పిల్లలు ఖర్జూర కాయలను నేరుగా తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారికోసమే ఈ ఖర్జూరాల హల్వా.

కావ‌ల‌సిన‌వి

2 కప్పులు ఖర్జూరాల తరుగు( విత్తనాలు తీసి ముక్కలుగా కోసుకోవాలి)

 2 క‌ప్పుల కాచిన వేడి పాలు

కప్పు చక్కెర (మిక్సీ పట్టుకోవాలి)

3 చెంచాల తాజా నెయ్యి

గుప్పెడు బాదం, జీడి, పిస్తా పప్పు పలుకులు

త‌యారీ

ముందుగా ఖర్జూరాల తరుగు, కాచిన వేడి పాలు కలిపి 2 గంటలు నాననిచ్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో మూకుడులో  ఈ మిశ్రమం, చక్కెర పొడి వేసి కలుపుకొని సన్నని సెగ మీద అరగంటపాటు ఉడికించాలి. చక్కెర పాకంలో ఖర్జూరాల మిశ్రమం బాగా ఉడికిన తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకొని చివరగా డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లుకొని దించుకొని ఆరిన తర్వాత తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మధుమేహులు చక్కెరకు బదులుగా బెల్లం వాడుకోవచ్చు. 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE