సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలు చిరుతిండి తీసుకునేందుకు ఇష్టపడతారు. అదీ ఇంట్లో అప్పటికప్ప్పుడు చేసిన తాజా చిరుతిండిని వారు మరింత ఇష్టంగా తింటారు. అలాంటి వాటిలో అటుకుల లడ్డూ ఒకటి.  కమ్మని రుచి, బోలెడన్ని  పోషకాలు, సులభంగా జీర్ణం కావటంతో బాటు కొవ్వు బహు తక్కువగా ఉండే చిరుతిండిది. అదెలా చేసుకోవాలో తెలుసుకుందాం. 

కావ‌ల‌సిన‌ పదార్థాలు

2 కప్పుల అటుకులు

చక్కెర అరకప్పు

గుప్పెడు బాదం, జీడి, పిస్తా పప్పుల పలుకులు

3 యాలక్కాయలు

పావు కప్పు తాజా నెయ్యి 

గరిటెడు తాజా ఎండు కొబ్బ‌రి తురుము

త‌యారీ

ఒక మూకుడులో ముందుగా అటుకులు పోసి సన్నని సెగమీద దోరగా వేయించుకొని పక్కనబెట్టుకోవాలి. అటుకులు  ఆరిన తర్వాత అందులో నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో చివరగా నెయ్యి కలుపుకొని మరో మారు మిక్సీ పట్టి మిశ్రమాన్ని వెంటనే లడ్డూ కట్టుకోవాలి. 



Recent Stories







bpositivetelugu

చదివింది బాగా గుర్తుండాలంటే..

 కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు.  

MORE
bpositivetelugu

శరన్నవరాత్రి వైశిష్ట్యం 

ఇతర దేశీయులతో పోల్చితే భారతీయులకు పండుగలు ఎక్కువ. భౌతిక జీవన ప్రభావం నుంచి మనసును పరమాత్మ వైపు 

MORE