శీతాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఆంగ్లంలో కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని పిలిచే ఈ పండు కమ్మని రుచిగా ఉండటమే గాక ఆరోగ్యానికి చెప్పలేనంత మేలు చేస్తుంది.  సీతాఫలంతో బాటు ఈ చెట్టు ఆకు, బెరడు, గింజలలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. యాపిల్ వంటి ఫలాలతో పోల్చితే చౌకేగాక అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ సీజన్లో తప్పక సీతాఫలం తిని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.  

 • కొవ్వు అసలేమాత్రం లేని సీతాఫలంలో సులువుగా అరిగిపోతుంది గనుక అన్ని వయసుల వారూ హాయిగా తినొచ్చు.
 • బాగా నీరసంగా ఉన్నప్పుడు ఈ పండు తింటే శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది.
 • సీతాఫలంలో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇందులోని విటమిన్ బి 6 శ్వాస సంబంధిత సమస్యలను దరిజేరనీయకుండా చూస్తుంది.
 • పేగుల్లోని నులిపురుగుల నివారణలో, కడుపులోని అల్సర్‌ తగ్గేందుకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • సీతాఫలంలోని పీచు, కాపర్ వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడి గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం బెడద ఉండదు.
 • బక్కపలచగా ఉన్నవారు కప్పు సీతాఫలం గుజ్జులో చెంచా తేనె, 2 చెంచాల పాలు కలుపుకు తింటే వేగంగా బరువు పెరుగుతారు.
 • గర్భిణులు సీతాఫలం తింటే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ చక్కగా పనిజేయటమే గాక గర్భస్రావం అయ్యే ముప్పు తగ్గుతుంది.
 • ఈ పండులో విరివిగా లభించే డైటరీ ఫైబర్ టైప్-2 మధుమేహాన్ని అదుపుచేస్తుంది. ఈ పండు తినేవారికి రక్తహీనత, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. 
 • ఈ పండులో లభించే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపు చేసేందుకు దోహదపడతాయి.
 • సీతాఫలం చెట్టు ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్‌ పౌడర్‌ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద వదిలిపోతుంది.
 • మెరుగైన కీళ్ల ఆరోగ్యం, కంటి చూపు, చర్మ ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ పండు ఉపయోగపడుతుంది.
 • వేవిళ్లు తగ్గాలన్నా, కాన్పు తర్వాత బాలింతలు బరువుతగ్గాలన్నా ఈ పండు తినాలి.
 • సీతాఫలం ఆకులను నూరి సెగగడ్డల మీద కట్టుకడితే ఒక్కరోజులో గడ్డ సమసిపోతుంది. 

గమనిక: లివర్, కిడ్నీ రోగాల బాధితులు,ఆస్తమా పీడితులు  సీతాఫలాన్ని తినకపోవటమే మంచిది.

               మధుమేహులు ఉదయాన్నే ఏ పండు తింటే ఒక్కసారి చక్కెర స్థాయిలు పెరిగే ముప్పు ఉంటుంది.  Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE