అపోహ : కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్‌ నిరోధించి.. బరువు పెంచుతాయి

వాస్తవం: కేవలం కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరగడం ఉండదు. ఎక్కువ కేలరీల ఆహరం తీసుకోవటం, అందుకు తగిన వ్యాయామం చేయకపోవటం, జన్యుపరమైన అంశాలు అధిక బరువుకు కారణాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ  అభిప్రాయంతో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోతే ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందవు. పోషకాలకు  బదులు సప్లిమెంట్లను తీసుకున్నా అవి సహజ పోషకాల శక్తికి ప్రత్యామ్నాయం కావు . అందుకే తగినన్ని కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి. 

అపోహ: బరువు పెరగకుండా ఉండాలంటే సాయంత్రం ఏడింటికే భోజనం చేయాలి.

వాస్తవం: డిన్నర్, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఇందుకు పనివేళలు సహకరించకపోతే నూనెలు వాడిన వంటకాలు పరిమితం చేసుకోవాలి. తిన్న వెంటనే నిద్ర పోతే బరువు పెరిగే ముప్పు ఎక్కువ. 

అపోహ: పాలు, పాల ఉత్పత్తులు అధిక బరువుకు దోహదం చేస్తాయి.

వాస్తవం: పాలు సంపూర్ణ పోషకాహారం. ఇందులో సుమారు 14 రకాల ప్రధాన పోషకాలుంటాయి. ముఖ్యంగా మాంసకృత్తులు.. కాల్షియం ఉంటాయి. 'పాల నుంచి అందే కాల్షియం వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి అందే కాల్షియం కంటే త్వరగా శరీరానికి అందుతుంది. దీనిలో లినోలిక్‌ ఆమ్లం... కొవ్వును కరిగించడానికి ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.కనుక పాల ఉత్పత్తులు వాడాల్సిందే. 

అపోహ: ప్రొటీన్లను.. కార్బోహైడ్రేట్లను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

వాస్తవం: సమతుల ఆహారంలో పై రెండూ భాగమే గనుక వాటిని తీసుకోవాల్సిందే. ఇక ఈ రెండూ ఆకలిపి తీసుకుంటే బరువు పెరుగుతుందని చెప్పలేము. ఇలా చేయటం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందక దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే సమతుల ఆహారం తీసుకోవాలి. ఏది తిన్నా ఆ క్యాలరీలు కరిగించేందుకు తగినంత  వ్యాయామం చేయాలి.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE