బెండకాయను ఇష్టపడనివారుండరు. విందు ఏదైనా బెండకాయ వంటకం ఉండాల్సిందే. ఆకట్టుకొనే రంగు, అమ్మాయి చేతి వేళ్ళలా నాజూకైన రూపం, కమ్మని రుచి దీని ప్రత్యేకతలు. బెండలోని యాంటీ ఆక్సీడెంట్లు, పీచు, ఇతర పోషకాలు, ఆరోగ్య పరిరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయి. బెండలోని  ఐరన్, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, బీటాకెరోటిన్, బి-కాంప్లెక్స్, విటమిన్-సి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచేలా చేసి నాడీవ్యవస్థను చురుగ్గా పనిచేయిస్తాయి. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అని అంటారు. 

 ఉపయోగాలు

  • బెండలో విరివిగా లభించే పీచు మలబధ్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పీచు బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
  • బెండకాయలోని పెక్టిన్ రక్తంలోని హానికారక కొలెస్టాల్ ను తగ్గించి హృదయ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది.
  • ఎసిడిటీ,గ్యాస్, అల్సర్ల బాధితులు పచ్చి బెండ తింటే ఆ జిగురు జీర్ణకోశానికి లోపల పొరగా ఏర్పడి ఉపశమనం కలుగుతుంది.
  • బెండలోని డయూరిటిక్‌ గుణాల వల్ల మూత్ర సంబంధిత, మూత్రాశయ నాళపు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. మూత్రం సాఫీగా వస్తుంది.
  • జ్వరం బాధితులు బెండ ముక్కలు వేసి కాచిన నీటిని చల్లబరిచి తాగితే జ్వరం తగ్గుతుంది.
  • మధుమేహులు గ్లాసు నీటిలో బెండకాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచి లేవగానే ముక్కలు తీసి ఆ నీటిని తాగాలి. ఇలాచేస్తే 2 వారాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
  • తరచూ బెండకాయ తినేవారిలో మెదడు పనితీరు బాగుంటుంది. మానసిక సమస్యలు దరిజేరవు.
  • బెండకాయలోని ఫోలిక్ ఆమ్లం అటు గర్భిణులకు, శిశువు నాడీవ్యవస్ధ వృధ్ధికి ఇతోధికంగా మేలు చేస్తుంది.
  • బెండలోని కాల్షియం, విటమిన్ -సి వల్ల ఎముకలు, కీళ్ళు పనితీరు బాగుంటుంది. కండరాలను, ఎముకలను పట్టి ఉంచే సున్నితమైన కణజాలం బలపడుతుంది.

 

పోషకాల వివరాలు (ప్రతి 100 గ్రాములకు)

 

పిండి పదార్థాలు    -     6.4 శాతం

మాంసకృత్తులు    -    1.9 శాతం

కొవ్వు               -     0.2 శాతం

పీచు                -      1.2 శాతం

ఖనిజ లవణాలు   -     0.7 శాతం

సున్నం             -      66 మి.గ్రా

భాస్వరం            -      56 మి.గ్రా

ఇనుము              -     0.30 మి.గ్రా

విటమిన్ సి           -    13 మి.గ్రా.

మెగ్నీషియం         -    53 మి.గ్రా.

సోడియం             -    6.9 మి.గ్రా.

పొటాషియం          -    103 మి.గ్రా

కాపర్                 -     113 మి.గ్రా.

మాంగనీస్‌            -     149 మి.గ్రా

జింక్‌                  -     417 మి.గ్రా 

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE