ఇప్పటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం. జన్యుపరమిన, జీవన శైలి మార్పుల కారణంగా సంక్రమించే వ్యాధి ఇది. దీని నివారణ, నియంత్రణలో మందులు ఎంతగా పనిచేస్తాయో మన పోపులపెట్టేలోని మెంతులూ అంతే ఉపయోగపడతాయి. దక్షిణాదిలో విరివిగా మెంతులు వాడుతారు. మెంతి ఆవకాయ, మెంతి కూర పప్పు గురించ తెలియని తెలుగు వారుండరు. రుచికి చేదుగా ఉన్నా ఔషధ గుణాలపరంగా అమ్రుతప్రాయమైన మెంతుల వాడకం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అద్భుతమైన మెంతుల గుణాల గురించి ఆయుర్వేదం సైతం ప్రస్తావించింది. మెంతి ఆకుల్లోని పీచు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇలా మరెన్నో గుణాలున్న మెంతులు మధుమేహ నివారణలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

ఉపయోగాలు

  • రక్తంలోని చక్కర నిల్వలను నియంత్రించి మధుమేహం రాకుండా చూడగల శక్తీ మెంతులకు ఉంది.
  • వీటిలోని సపోనిన్ అనే రసాయనం ఆహారం ద్వారా ఒంట్లో చేరే చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
  • మెంతి ఆకులోని పీచు ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుంది.
  • చనుబాలు పడని బాలింతలు మెంతులను ఏదోరూపంలో తీసుకుంటే చక్కగా పాలు పడతాయి.
  • మెంతుల్లోని మ్యూసిలేజీ అనే పదార్ధం ఒంట్లో చేరిన ఫ్రీస్ రాడికల్స్ ను అడ్డుకొని కాన్సర్ రాకుండా చూస్తాయి.

మధుమేహ నివారిణి

మెంతుల్లోని గాలక్టోమన్నన్ అనే నీటిలో కరిగే స్వభావం వున్నా పీచు, జీర్ణక్రియను అవసరమైనంత మేరకు మందగింపజేసి అధిక చక్కెరలను గ్రహించకుండా చేస్తుంది.  మెంతుల్లోని 4 హైడ్రాక్సీ ఐసోలూసిన్  అనే అమైనో ఆమ్లము టైప్ 1, టైప్ 2 మధుమేహాలను దరి చేరనీయకుండా చూస్తుంది.

వాడే పద్దతి

  • మెంతులను సన్నని సెగ మీద రెండు, మూడు నిమిషాల పాటు వేయించి,పొడి చేసుకుని దానిని కూరలు, వేపుళ్లలో, సలాడ్లలో చల్లుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
  • చెంచాడు మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరునాటి ఉదయం మంచినీటితో తీసుకోవాలి.
  • మెంతి మొలకలను సలాడ్ మీద చల్లుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
  • రొట్టెలు, పరోటా, ఇడ్లీ, దోసె తయారీ పిండిలో మెంతి ఆకు తరుగు కలుపుకుంటే కావలసినంత పీచు దొరికినట్లే. (చేదుగా ఉంటాయి గనక కొంచం చాలు)
  • మెంతులు, నిమ్మ రసం, తేనె కలిపి చేసే హెర్బల్ టీ విష జ్వరాలకు మందుగా పనిచేస్తుంది.

ఇతర వంటకాలు

మెంతి టీ

చెంచాడు మెంతులను మిక్సీ పట్టి, దానిని వేడినీటిలో మూడు గంటల పాటు నాననివ్వాలి. ఆ నీటిని టీ పొడితో కలిపి మరిగించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రవ్వంత తేనె కలుపుకొని వేడి వేడిగా ఆస్వాదించాలి.

మెంతి మొలకల సలాడ్

రాత్రంతా నీటిలో నానిన మెంతులను పొడిగుడ్డ లో చుట్టి సీసాలో ఉంచాలి. రెండు రోజులకు వాటి నుంచి మొలకలు వస్తాయి. ఈ మొలకలకు గుప్పెడు టమోటా, కీరదోస, కాప్సికం, క్యారెట్ ముక్కలు కలుపుకోవాలి. దీనికి కొంచం కొత్తిమీర తరుగు, నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి కలుపుకుంటే మెంతి సలాడ్ రెడీ అయినట్లే.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE