ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సరిచేయటమే గాక ఒంట్లోని వ్యర్ధాలను వదిలించేందుకు దోహదం చేస్తుంది. పలు రోగాలను నివారించే త్రిఫల చూర్ణపు విశిష్ట గుణాల గురించి తెలుసుకుందాం. 

ప్రత్యేకతలు

ఈ చూర్ణంలో ఉండే ఉసిరి ద్వారా బత్తాయికంటే 20 రెట్లు అధికంగా విటమిన్ సి లభిస్తుంది. పిత్తదోషాలు, శరీర ఉష్ణోగ్రతలో తేడాలు, మలబద్ధకం, రక్తప్రసరణ లోపాల వంటి సమస్యలకు ఉసిరి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని తానికాయ రుచికి వగరుగా , కాస్త ఘాటుగా ఉంటుంది. ఇది కఫదోషాలను నివారించి ఒంట్లోని అదనపు శ్లేష్మాన్ని తొలగిస్తుంది. విటమిన్ ఎ అధికంగా అందించే తానికాయ జీర్ణవ్యవస్థ పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. శ్వాస సమస్యలకు కారణమయ్యే ఎలర్జీలు, గొంతు సమస్యలు, ప్రేగుల్లోని పరాన్నజీవుల నివారణకు ఇది ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఈ చూర్ణంలో ఉండే మూడో ఫలం కరక్కాయ.ఇది వాత దోషాలకు మంచి ఔషధం. కాలేయ, కండర, నాడీ సమస్యలు, మలబద్ధకాలను నివారిస్తుంది. ఇది జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారంలోని పోషకాలను పూర్తిగా శరీరం గ్రహించేలా చేస్తుంది. 

ఎలా వాడాలి?

సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ పొందేందుకు ఎవరైనా త్రిఫల చూర్ణాన్ని వాడొచ్చు. అయితే శరీర గుణాన్ని బట్టి తగు అనుపానంతో ఆయుర్వేద వైద్యులు సూచించినట్లు వాడితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా 2-5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని నీటితో కలిపి కషాయంగా, రాత్రిపూట పాలు లేదా తేనెతో తీసుకుంటారు. ఉసిరి, తాని, కర్కకాయల పాళ్ళు సమంగా ఉన్నప్పుడు ఈ చూర్ణం చక్కని ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు మాత్రల రూపంలోనూ ఇది దొరుకుతోంది. 

ఎలా వాడితే  ఏ ఫలితం? 

  • కాలేయంలోని వ్యర్థాలను వదిలించి శుద్ధి చేస్తుంది.
  • అజీర్తి, వదలని విరేచనాలు బాధిస్తుంటే 2 చెంచాల త్రిఫల చూర్ణాన్ని గ్లాసు నీటిలో మరిగించి వడపోసి ఆ కషాయానికి కొద్దిగా మంచినీరు కలిపి తీసుకుంటే సమస్య ఉపశమిస్తుంది.
  • మలబద్ధక బాధితులు 2 చెంచాల తేనెలో 5 గ్రాముల త్రిఫలచూర్ణాన్నికలిపి ముద్ద చేసి అరకప్పు పాలలో కలుపుకొని పడుకునేముందు తాగితే సుఖవిరేచనం అవుతుంది.
  • 2 చెంచాల కొబ్బరి నూనెలో చెంచా త్రిఫలచూర్ణం మరిగించి వడగట్టి తలకు రాసుకుంటే జుట్టుకు తగిన ఫాషన్ లభించటమే గాక నిగారింపు వస్తుంది.
  • దీని రక్తశుద్ధి గుణం వల్ల చర్మ వ్యాధులు తొలగి, చర్మం కోమలంగా మారుతుంది. సూర్యరశ్మి వలన చర్మంలో వచ్చే దుష్ప్రభావాలను కూడా త్రిఫలచూర్ణం నివారిస్తుంది.
  • రోజూ త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా వాడితే రుతుచక్ర సమస్యలు తొలగిపోతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE