శరీరానికి ఆహారమే ఆలంబన. చక్కని ఆరోగ్యం కోసం తగినంత పోషకాహారం ఎంత ముఖ్యమో దాన్ని ఒక క్రమపద్దతిలో తీసుకోవటమూ అంతే ముఖ్యం. ఈ ఆధునిక యుగంలోనూ అత్యధికులు తగిన రీతిలో ఆహారం తీసుకోవడంలేదనీ, ఆహారం విషయంలో వారికి ఎలాంటి స్పష్టతా లేదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు . ఆహారానికి సంబంధించి ఆయుర్వేదం ప్రతిపాదించిన దిగువ నియమాలను పాటించటమే పలు జీర్ణ సమస్యలకు పరిష్కారమని వారు సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. 

 • తినేది గుప్పెడయినా వేళపట్టున తినాలి. ఎంత బిజీగా ఉన్నా ఈ నియమాన్ని పాటించాల్సిందే.
 • స్నానం చేసి ఆహారం తీసుకోవటం వల్ల ఆహారాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు.
 • ఆహారాన్ని శ్రద్ధగా, ఇష్టంగా తీసుకోవాలి. కోపంతో , బాధతో, అయిష్టంగా తీసుకొనే ఆహారం అనారోగ్య హేతువు.
 • టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ, ఫోన్ మాట్లాడుతూ, అటూ ఇటూ తిరుగుతూ, బిగ్గరగా నవ్వుతూ ఆహారం తీసుకోరాదు.
 • ఆహారాన్ని బాగా నమిలి తినాలి. హడావిడిగా మింగటం వల్ల జీర్ణ సమస్యలు తప్పవని గ్రహించాలి. 
 • ఆకలి మేరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి తప్ప పొట్టనిండా కుక్కకూడదు.
 • ఒక్కసారే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొనే బదులు తగిన విరామం ఇచ్చి విడతల వారీగా ఆహారాన్ని తీసుకోవాలి.
 • దప్పికగా ఉన్నప్పుడు ఘనాహారం, ఆకలిగా ఉన్నప్పుడు ద్రవాహారం తీసుకోరాదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.
 • భోజనం చేసేటప్పుడు అవసరమైతే మధ్యలో కొద్దిగా నీరు త్రాగొచ్చు. అయితే భోజనానికి అరగంట ముందు లేదా భోజనము చేసిన వెంటనే ఎక్కువ నీరు త్రాగకూడదు.
 • రోజులతరబడి ఫ్రిజ్ లో పెట్టిన కూరలు, పచ్చళ్ళు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకొన్నట్టే. అలాగే మరీ వేడిగా ఉన్నఆహారం కూడా మంచిదికాదు.
 • పాడైన ఆహారం తిన్నా లేదా ఒకసారి వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడిచేసి తిన్నా అనారోగ్యం తప్పదు.
 • ఏదైనా కారణం వల్ల ఉదయం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే సాయంత్రం తేలికపాటి ఆహారంతో సరిపెట్టాలి తప్ప రోజూ తినే పరిమాణంలో ఆహారం తీసుకోరాదు.
 • తిన్న వెంటనే పడుకోవటం, ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం, వేగంగా వాహనాలు నడపటం వల్ల జీర్ణ సమస్యలు తప్పవని తెలుసుకోవాలి.
 • శీతాకాలంలో భోజనానికి ముందు చిన్న అల్లంముక్క నమిలితే జీర్ణశక్తి పెరుగుతుంది.
 • ఆయుర్వేదం ప్రకారం ముందు తీపి, మధ్యలో కారపు పదార్థాలు, చివరిగా చేదు పదార్థాలను తినాలి.
 • ఆహారంలో నెయ్యి, పెరుగు, మజ్జిగ తీసుకోవడం, రాత్రి భోజనానంతరం పాలు తాగటం ఆరోగ్యానికి మంచిది.
 • వారానికి కనీసం ఒక్క పూటైనా ఉపవాసం చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE