ఈస్టర్ సందర్భంగా చేసుకొనే వంటకాల్లో మార్బుల్ కేక్‌ ఒకటి. చూడచక్కని రంగు, నోరూరించే రుచిగల మార్బుల్ కేక్ తో ఈ ఈస్టర్ రోజు అతిథుల నోరు తీపిచేద్దాం. 

కావలసినవి

 మైదా - అరకప్పు, చక్కెర - అరకప్పు, నెయ్యి - అరకప్పు, కోడిగుడ్లు - 2, కోకో పౌడర్ - 3 చెంచాలు, బటర్ - 1 చెంచా, బేకింగ్ పౌడర్ - అర చెంచా, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా 

తయారీ

 ముందుగా బేకింగ్ బౌల్ లోపలి వైపు వెన్న రాసి దానిమీద గుప్పెడు మైదా పిండిని పలుచగా  చల్లాలి. తర్వాత ఆ గిన్నెని బోర్లించి అంటుకోకుండా మిగిలిన పిండిని దులిఫై పక్కనబెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను పగలగొట్టి  తెల్లసొన, పచ్చసొనని వేరు వేరు గిన్నెల్లో కార్చుకోవాలి. అనంతరం  మైదాలో బేకింగ్ పౌడర్ కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు  ఒక గిన్నెలో నెయ్యి తీసుకుని అందులో పొడిచేసిన చక్కెర ను వేసి పూర్తిగా కరిగే వరకు కలిపి ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి తెల్లని నురుగు వచ్చేవరకు గిలకొట్టి ఆ  తర్వాత అందులో పచ్చసొనను కూడా వేసి బాగా గిలకొట్టాలి.  ఇలా సిద్దమైన మిశ్రమంలో బేకింగ్ పౌడర్ కలిపిన మైదాపిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసి..  ఓ భాగంలో వెనిల్లా ఎసెన్స్, మరో భాగంలో కోకో పౌడర్ కలపాలి.

తర్వాత  కేక్‌ గిన్నెలో ముందుగా కొద్దిగా వెనిల్లా కలిపిన మిశ్రమం పోసి దానిమీద కోకో పౌడర్ కలిపిన మిశ్రమం, ఆపైన మళ్లీ వెనిల్లా కలిపిన మిశ్రమం... ఇలా రెండు మిశ్రమాలనూ పొరలు పొరలుగా పోసుకోవాలి. తర్వాత ఓ ఫోర్క్ తీసుకుని, మొత్తం మిశ్రమాన్ని పొరలు చెదిరిపోకుండా  నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు గిన్నెను ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న మైక్రో ఓవెన్ లో పెట్టి, 45 నిమిషాల పాటు బేక్ చేసుకొని తీసి ఆరిన తర్వాత కోరుకొన్న తీరులో కట్ చేసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE