చూసేందుకు ముళ్ళ మొక్కలా కనిపించే కలబందకు ఔషధ మొక్కలలో ముఖ్యమైన స్థానం ఉంది. సంస్కృతంలో ఘృతకుమారిగా పిలిచే కలబందను ఆయుర్వేదవైద్యంతో బాటు పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో విరివిగా వాడుతున్నారు. అన్ని వాతావరణాల్లో పెరిగే కలబందను ఇళ్లలో కుండీల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఆరోగ్య పరిరక్షణలో కలబంద ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.  

ఉపయోగాలు

  • తాజా కలబంద గుజ్జు అజీర్తి, కడుపుబ్బరం, కడుపులో మంట,గ్యాస్ వంటి సమస్యలతో బాటు రక్తశుద్ధికి దోహదం చేస్తుంది.
  • కలబంద గుజ్జు వినియోగంతో గ్రంధుల వాపులు, ప్లీహ, కాలేయ కామెర్ల వ్యాధులు నివారించబడతాయి.
  • లైంగిక శక్తిని పెంపొందించడంలో కలబంద గుజ్జు ఎంతగానో మేలుచేస్తుంది.
  • కలబంద గుజ్జు, తేనె మిశ్రమంలో వేపిన ఇంగువ కలిపి తీసుకొంటే హిస్టీరియా సమస్య దూరమవుతుంది.
  • శరీర వాపు, నొప్పుల బాధితులు వేడిచేసిన గుజ్జు రాసుకొంటే మంచి గుణం కనిపిస్తుంది.
  • వేసవిలో కలబంద గుజ్జును చక్కెర తో కలిపి తీసుకొంటే ఒంట్లోని వేడి తగ్గుతుంది. ఎండ నుంచి రక్షణ, కీటకాలు కుట్టినపుడు ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది.
  • కలబంద గుజ్జు, పసుపు కలిపి ముఖానికి పట్టించి, ఆరాక చల్లని నీటితో కడుక్కొంటే ముఖంమీది మురికిపోయి చర్మం మెరుస్తుంది.
  • చర్మం మీది నల్లని మచ్చలపై కలబంద గుజ్జు రాస్తే వారం రోజుల్లో ఆ మచ్చలు తొలగిపోతాయి.
  • కలబంద గుజ్జును జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే గాక నిగారింపు వస్తుంది. జుట్టు రాలడం, బాల నెరపు, జుట్టుకోనలూ పొడిబారి చిట్లటం, చుండ్రు వంటి సమస్యలూ దూరమవుతాయి.
  • తలలోని పేలు చేసిన గాయాలు, దుమ్ము కారణంగా పుట్టే దురదను కలబంద గుజ్జు తగ్గిస్తుంది.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE