అల్పాహారంగా తీసుకోదగిన వంటకాల్లో బ్రెడ్ వెజ్ బర్గర్ ఒకటి. ఇది మంచి పోషకాహారమే గాక కమ్మని రుచిగానూ ఉంటుంది. తిండి విషయంలో పేచీ పెట్టే పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలాచేయాలో తెలుసుకుందాం. 

కావలసినవి

బ్రెడ్ పొడి - ఒక కప్పు, క్యాబేజీ, బీన్స్, క్యారెట్, బంగాళాదుంప తురుము - 50 గ్రాముల చొప్పున , క్యాప్పికమ్ ముక్కలు - పావు కప్పు, ఎండు కారం - అర చెంచా, ధనియాల పొడి - అర చెంచా, జీలకర్ర పొడి - పావు చెంచా, గరంమసాలా పొడి - పావు చెంచా, మొక్కజొన్నపిండి - 30 గ్రాములు, పాలు - 60 మి.లీ, బన్నులు - 2, పెరుగు - గరిటెడు, టమోటా కెచప్ - చెంచా, టమోటా ముక్కలు (చక్రాలుగా కోసుకోవాలి) - 2, చీజ్ స్లైస్ - 1, మెయోనేస్ - ఒక కప్పు, ఉప్పు రుచికి తగినంత,

తయారీ

  • ముందుగా వెడల్పాటి పెద్ద గిన్నెలో ఒక కప్పు చొప్పున క్యారెట్, క్యాబేజ్ తరుగు, పావుకప్పు కాప్సికమ్‌ తరుగు, చెంచా చక్కెర , తగినంత మెయోనేస్‌ వేసి బాగా కలపాలి. దీన్నే కోల్‌స్లా అంటారు.
  • తరువాత మిగిలిన కూరగాయ ముక్కల్ని నీళ్లుపోయకుండా ఆవిరిమీద ఉడికించుకొని అందులో ఉప్పు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా ఒత్తి పక్కనబెట్టుకోవాలి. వీటినే వెజ్ ప్యాటీస్ అంటారు.
  • మరో గిన్నెలో మొక్కజొన్న పిండి, పాలు పోసి జారుడుగా కలుపుకుని ముందుగా చేసిపెట్టుకొన్న వెజ్ ప్యాటీస్‌ని ఈ మిశ్రమంలో ముంచి వెంటనే బ్రెడ్ పొడిలో పొర్లించి పక్కనబెట్టుకొని ఆరినతర్వాత నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బన్ను తీసుకుని టమోటా కెచప్ రాసి తరువాత రెండు చెంచాల కోల్‌స్లా వేసి, దానిపైన టమోటా ముక్కలు, వెజ్ ప్యాటీస్, చీజ్ ముక్కలు, పెరుగు వేసి రెండవ బన్ పెన బోర్లిస్తే బ్రెడ్ బర్గర్ తయారయినట్టే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE