కొన్నిపండ్లు తాజాగా తింటేనే వాటిలోని పోషకాలు పూర్తిగా అందిపుచ్చుకోగలం. అదే.. మరికొన్ని పండ్లు ఎంత ఎండితే వాటిలోని పోషకాలు అంతగా రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. పండిన అంజీర ఫలాలను సేకరించి చక్రాలుగా కోసి నిల్వ చేసి డ్రై ఫ్రూట్ గా వాడటం తెలిసిందే. రూపంలో మేడిపండులా ఉంటుంది గనుక దీన్ని సీమ మేడిపండు అనీ అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫిగ్ అనీ, హిందీలో అంజీర్ అంటారు. ఎన్నో పోషకాల సమాహారమైన అంజీర తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

 • అంజీరలో అధికంగా లభించే పీచు మూలంగా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్దుల కు ఎదురయ్యే జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది మంచి ఔషధమగా పనిచేస్తుంది.
 • ప్రస్తుత కాలంలో నిండా 30 ఏళ్ళు నిండనివారూ అధికరక్తపోటు సమస్య బారినపడుతున్నారు. ఇలాంటివారు పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే అంజీర తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
 • చాలామంది మహిళల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా ఉంటోంది. వీరు రోజూ అంజీర తీసుకుంటే నెలరోజుల్లోనే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది.
 • అధికబరువు బాధితులు భోజనానికి ముందు అంజీర ముక్కలు తింటే పొట్టనిండిన భావన కలిగి తక్కువ భోజనంతోనే సరిపెడతారు .దీనివల్ల కొద్దిరోజుల్లోనే బరువు సమస్య దారికొస్తుంది.
 • అంజీరలోని 'పెక్టిన్‌' అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలను తొలగించటంతో బాటు గుండెకూ బలాన్నిస్తుంది. అంజీరలో కొలెస్ట్రాల్‌ ఉండదు గనుక హృద్రోగ బాధితులు నిరభ్యంతరంగా అంజీర తినొచ్చు.
 • అంజీరలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్రపోషిస్తాయి. కనుక సంతానం కోరుకునే దంపతులు అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది.
 • అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది గనుక ఎదిగే వయసు పిల్లలకు, వృద్ధులు రోజూ అంజీర తింటే ఎముకలు బలపడతాయి.
 • అంజీరలోని పొటాషియం పొలిఫెనల్స్, ప్లెవొనోయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్లు టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి.
 • కిడ్నీలో రాళ్లున్న వారు 4-5 అంజీర చక్రాలను నీటిలో నానబెట్టి రోజూ తింటే రాళ్లు క్రమంగా కరుగుతాయి. 
 • కంటినిండా నిద్రలేనివారు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
 • అంజీర పండ్లను నేరుగా తినేకంటే ఓట్స్ , సలాడ్ , పాస్తా వంటివాటితోబాటు తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 • 3 పండిన అంజీరల్లో 65 కేలరీల శక్తి ఉంటే, అదే.. 3 ఎండిన అంజీరల్లో 215 కేలరీల శక్తి ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE