వేసవి ఫలాల్లో కర్బూజపండు ఒకింత ప్రత్యేకం. బంగారపు రంగు, ఆకట్టుకొనే రుచి, అందుబాటులో ఉండే ధర, అన్ని ప్రాంతాల్లో విరివిగా లభించటం, తేలికగా జీర్ణం కావటం  వంటి ఎన్నో ప్రత్యేకతలు గల కర్బూజాను పిల్లల మొదలు పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. వేసవితాపం నుంచి శరీరాన్ని రక్షించటమే గాక చెమట రూపంలో శరీరం కోల్పోయే పలు పోషకాలను ఇది భర్తీ చేస్తుంది. ఒంటికి చలువ చేసే ఫలంగా పేరున్న కర్బూజ చేకూర్చే ఇతర ఉపయోగాలేంటో తెల్సుకుందాం...! 

  • కర్బూజాలో 92 శాతం నీరే. అందుకే ఈ పండు తినటం వల్ల శరీరంలో నీటినిల్వలు భర్తీ అవుతాయి. తక్షణ శక్తి లభిస్తుంది. ఎంతటి దప్పికైనా తీరుతుంది.
  • కర్బూజలో జీవక్రియల నిర్వహణలో కీలకపాత్ర పోషించే సూక్ష్మ పోషకాలతో బాటు పలు విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఈ పండు తినటం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.
  • కర్బూజాలోని విరివిగా లభించే లైకోపీన్‌ వల్ల గుండె సమస్యలు రావు.
  • కర్బూజ వినియోగం రక్తంలోని చక్కెరశాతాన్నిఅదుపు చేస్తుంది. ఈ పండులోని చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకోగలదు.
  • ఎముకపుష్టిని కలిగించటంతో బాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
  • ఈ పండు తింటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. కిడ్నీల ఆరోగ్యానికి కర్బూజపండు చక్కగా ఉపయోగపడుతుంది.
  • కర్బూజ విత్తనాల్లోని పీచు బరువు తగ్గేందుకే గాక మలబద్ధకం నివారణకూ ఉపయోగపడుతుంది.
  • కర్బూజాలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచటమే గాక పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.
  • కర్బూజాలోని విటమిన్‌ ఏ, బీటా కెరొటిన్‌ కంటి పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్న వయసులో శుక్లాలు రాకుండా కాపాడుతుంది.
  • కర్బూజా వినియోగంతో కండరాలు, నాడుల మీది ఒత్తిడి తొలగి కంటినిండా నిద్రపడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE