మసాలా అనగానే ముందు గుర్తొచ్చేది.. అల్లం. వంటకాలకు ఘాటైన రుచి, మంచి సువాసన తెచ్చే అల్లం ఒక గొప్ప ఔషధం కూడా. వేలాది సంవత్సరాలుగా అటు వంటకాల్లో ఇటు ఔషధాల తయారీలో దీన్ని వినియోగిస్తున్నారు. ఎండాకాలంలో వడదెబ్బ కొట్టకుండా పుచ్చుకొనే మజ్జిగలో అల్లం ఉండాల్సిందే. అల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్య పరిరక్షణకు ఎంతగా దోహదపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గించటంతో బాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.
  • అల్లం వినియోగంతో ర‌క్తం శుద్ధి జరిగి శరీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. వీరిలో కొలెస్ట్రాల్‌ ముప్పు తగ్గి, గుండె జబ్బులు రావు.
  • నోటి దుర్వాస‌న‌, చిగుళ్ల నొప్పుల వంటి సమస్యలున్న వారు అల్లం ర‌సం తీసుకొంటే మంచి గుణం కనిపిస్తుంది.
  • మధుమేహులు ఉద‌యం, రాత్రి భోజ‌నానికి ముందు 1 చెంచా అల్లం రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • గ్యాస్, అజీర్తి, ఆకలి మందగించటం, కడుపులో అల్సర్లు వంటి సమస్యలున్న వారు అల్లం ర‌సం తాగితే సమస్యలు దూరమవుతాయి. కడుపునొప్పిగా ఉన్నప్పుడు నిమ్మరసం, అల్లం ర‌సాలను 2 చెంచాల చొప్పున తీసుకొని అందులో ఉప్పు వేసి తాగితే నొప్పి త‌గ్గుతుంది.
  • దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కావాలంటే ఓ కప్పు అల్లం కాషాయం తాగాల్సిందే.
  • రోజూ అల్లం ర‌సం తాగితే కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. మరిగే నీటిలో అల్లం తురుము వేసి మరిగించి ఆ కషాయంలో నిమ్మరసం కలుపుకు తాగితే ఎంతటి ఒళ్లు నొప్పులైనా త‌గ్గుతాయి.
  • అల్లం వినియోగం వల్ల కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది.
  • ప్రయాణాల్లో కలిగే వికారం, వాంతులా వంటి సమస్యలకు అల్లం వినియోగం చక్కని పరిష్కారం.
  • పలు ప్రసవానంతర సమస్యలకుఎండు అల్లం (శొంఠి) వాడటం తెలిసిందే.

ఇలా చేద్దాం

రెండు గ్లాసుల నీటిలో చెంచా అల్లం తరుగు వేసి 10 నిమిషాలు మరగనిచ్చి కాస్త చల్లారిన తర్వాత అందులో చెంచా తేనె కలుపుకు తాగాలి . మంచి యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేసే ఈ పానీయాన్ని వారానికోసారి తాగితే రోజువారీ సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE