దోశ అంటే ఇష్టపడని వారుండరు. అయితే బరువు పెరుగుతామనే భయంతో చాలామంది దోసె తినటం మానేస్తున్నారు. అలాంటివారికి చక్కని ప్రత్యామ్నాయం.. బ్రౌన్ రైస్ దోసె. ఉదయం తింటే 6 గంటల వరకు మళ్ళీ తిండిమీదికి మనసు పోనీయకుండా చేయటం దీని ప్రత్యేకత. కమ్మని రుచితో బాటు పోషకాల సమాహారమైన బ్రౌన్ రైస్ దోశను ఈ రోజే రుచిచూద్దాం.

కావలసినవి

 4 కప్పుల బ్రౌన్ రైస్, కప్పు చొప్పున మినప్పప్పు, అటుకులు, అరకప్పు చొప్పున కందిపప్పు, శెనగపప్పు, పెసరపప్పు, చెంచా మెంతులు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనె. 

చేసే పద్దతి

ముందుగా బ్రౌన్ రైస్, మినప్పప్పు, శెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పులను రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడిగి ఒక పాత్రలో మిశ్రమం చేసి.. తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే అటుకులను గంటపాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత అటుకులతోబాటు రాత్రంతా నానిన బ్రౌన్ రైస్, పప్పులను మిక్సీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాగా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి, దోసెపిండిలా గిన్నెలో కలుపుకుని మూతపెట్టి గది ఉష్ణోగ్రతలో 8 గంటలపాటు పెట్టాలి. దీనివల్ల కొద్దిగా పిండి పులిసి దోసె రుచిగా, మెత్తగా వస్తుంది. కాలిన పెనం మీద ఈ పిండి వేసి సన్నని సెగపై కొద్దిగా నూనె వేసుకొని రెండువైపులా ముదురు రంగు వచ్చేలా కాల్చుకుంటే వేడివేడి బ్రౌన్ రైస్ దోసె రెడీ!Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE