రంజాన్ అనగానే గుర్తొచ్చే వంటకాల్లో హలీం ముందుంటుంది. రంజాన్ ఉపవాస దీక్ష విరమించిన తర్వాత శరీరానికి తక్షణ శక్తిని అందించే వంటకమే హలీం. లేత పొట్టేలు మాంసంతో చేసిన వంటాకాన్ని హలీం అనీ, కోడి మాంసంతో చేసేదాన్ని హరీస్‌ అంటారు. ఈ రంజాన్ మాసపు వంటకాన్ని ముస్లింలతో పాటు మిగిలిన మతాల వారూ అంతే ఇష్టంగా రుచిచూస్తారు. ఒక పండుగ వంటకం గానే గాక ఇది గొప్ప పోషకాహారంగానూ గుర్తింపు పొందింది.

ఇదీ చరిత్ర

1866-1911 మధ్యకాలంలో హైదరాబాద్‌ను పాలించిన ఆరోనిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ రంజాన్ మాసంలో సైనిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి హాజరైన కొందరు పర్షియా ఆహ్వానితులు నాటి ఉపవాస దీక్ష విరమణ  వేళ తమ దేశపు ప్రత్యేక వంటకాన్ని గురించి నవాబుకు తెలియజేసారు. అబ్బురపడిన నవాబు వంటగాళ్ళను పిలిచి పర్షియా ప్రతినిధుల సూచనల మేరకు దాన్ని సిద్ధం చేయించారు. అలా ఈ రోజు మనం ఎంతో ఇష్టంగా తినే హలీం దక్కన్ మీద అవతరించింది.   నిజానికి పర్షియా వంటకమైనా నిజాం చొరవతోనే ఇది ప్రపంచానికి పరిచయమైంది.  ఏడో నిజాం నాటికి గొప్ప ప్రాచుర్యం పొందిన ఈ వంటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా రంజాన్‌ వేళ అన్ని మతాలవారినీ ఒక్కటి చేస్తోంది.

తయారీ

పది నిమిషాల్లో తినేసే హలీం వెనుక 10 గంటల శ్రమ ఉంది. ప్రత్యేకమైన పొయ్యి మీద ఉదయం 4 గంటలకే తయారీ మొదలౌతుంది . ముందుగా మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో 5 గంటల పాటు ఉడికిస్తారు. ఇందులో నానబెట్టిన గోధుమనూక, పిస్తా, బాదం, జీడిపప్పు, ఇతర డ్రైప్రూట్స్, నెయ్యి, ఫిరంజి, అక్రోట్స్, యాలకులు, సాజీర, దాల్చిన చెక్క, గరం మసాల తదితర 55 రకాల దినుసులను నియమిత పద్దతిలో కలిపి మరో 4 గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు. ఉడికిన తర్వాత ఇందులో నెయ్యి కలిపి బాగా కలిసేలా ప్రత్యేకమైన కర్రలతో మెదుపుతారు.  దీనికి మరింత రుచి వచ్చేందుకు ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీన, నిమ్మరసాన్ని కలిపి వడ్డిస్తారు.

ఎన్నో రకాలు

ఇరానీ హలీం..

నగరంలో స్థిరపడిన ఇరానీ కుటుంబాలవారు చేసే ఈ ఇరానీ హలీం ఎక్కువ ఘాటుగా ఉండదు. డ్రైఫ్రూట్స్‌తో పాటు గోధుమలు, మినప పప్పు, తక్కువ మోతాదులో మసాల దిననుసులు వినియోగిస్తారు. దీన్ని ఎక్కువసమయం కలపటం ఉండదు కనుక ఇది పేస్టులా గాక చిన్న చిన్న గింజల్లా ఉంటుంది. ఇందులో నిమ్మరసం వాడరు. 

అరేబియన్ హలీం..

తక్కువ మసాల దినుసులతో తయారయ్యే ఈ హలీంలో కారం అసలే వాడరు. గోధుమలు, మాంసం, నెయ్యిలను సమపాళ్లలో కలిపి డ్రైఫ్రూట్స్ వేసి చేస్తారు. ఇందులోనూ నిమ్మకాయను వాడరు. సులభంగా జీర్ణమవుతుంది.

జాఫ్రానీ హలీం..

గోధుమలు, మాంసం, నెయ్యితో పాటు కుంకుమ పువ్వును కలిపి చేసే ఈ వంటకం కమ్మని వాసనతో ఆకట్టుకొంటుంది. అయితే దీన్ని  ఎక్కువగా తింటే వేడి చేసే ప్రమాదం ఉంది. 

చేపల హలీం

గోధుమ రవ్వతో పాటు ఇలాచీ, లవంగం, మినప పప్పు ఉడికించి చివరలో  చేపముక్కలు కలిపి దీన్ని తయారు చేస్తారు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE