కావలసినవి

    చింతపండు -15 గ్రా, టమోటాలు -200 గ్రా, కంది పప్పు ఉడికించిన నీళ్ళు -4 గ్లాసులు ,వెల్లుల్లి -20 గ్రా, పచ్చి మిర్చి -4, కరివేపాకు -3 రెమ్మలు , కొత్తిమీర తరుగు - గుప్పెడు, పసుపు- చిటికెడు, ధనియాలు -20 గ్రా, మిరియాలు -10 గ్రా, జీలకర్ర -5గ్రా, ఎండు మిర్చి -3 ,ఆవాలు - పావు చెంచా, ఇంగువ చిటికెడు , నూనె - గరిటెడు, ఉప్పు - రుచికి తగినంత 

చేసే పధ్ధతి 

అరగ్లాసు నీటిలో చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక మిరియాలు,జీలకర్ర ,ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి చింతపండు నీళ్ళు పోసి కాగాక అందులో కంది పప్పు ఉడికించిన నీళ్ళు,మెత్తగా నలిపిన టమాటాలు ,దంచిన వెల్లుల్లి ,పచ్చి మిర్చి ,పసుపు ,ఉప్పు, కరివేపాకు ,కొత్తిమీర ,రసం పొడి వేసి అన్నీ కలిపి 2 పొంగులు వచ్చేవరకు వుంచి ఇంగువ ,ఆవాలతో పోపు వేసుకొంటే అద్భుతమైన రుచిగల మద్రాస్ రసం రెడీ అయినట్టే.

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE