చిరుజల్లులు లేదా చల్లని వాతావరణంలో ఇంట్లో చేసే చిరు తిండిని వేడివేడిగా ఆస్వాదించటం మరువలేని అనుభూతి. ఇక.. వేడివేడి పునుగులైతే ఆ మజానే వేరు. 

కావలసినవి

మినప్పప్పు- 100గ్రా, బియ్యం- 200గ్రా, ఉల్లిపాయలు- 2, పచ్చిమిర్చి- 4, ఉప్పు- రుచికి సరిపడ, పసుపు- చిటికెడు, జీలకర్ర - చెంచా, నూనె- సరిపడ, కొత్తిమీర, కరివేపాకు తరుగు- కొద్దిగా 

చేసే పధ్ధతి

మినపప్పును, బియ్యాన్ని కలిపి 2 గంటలు నానబెట్టి, శుభ్రంగా కడిగి గ్రైండర్ లో కొంచం బరకగా రుబ్బుకుని, పిండిని కొద్దిగా పులవనివ్వాలి. పిండి మరీ జారుడుగా ఉంటే ఎక్కువ నూనెను పీల్చుకోవటమే గాక పునుగులు కూడా మెత్తగా వస్తాయి. ఈ పిండిలో పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసి కలిపి, కాగిన నూనెలో పునుగుల్లా వేసి ఎర్రగా వేగాక టిష్యు పేపర్ వేసిన ప్లేట్ లోకి వేసుకోవాలి. వీటిని వేడివేడిగా వేరుశెనగపప్పు చట్నీ, కరివేపాకు కారంతో అడ్డుకొని తింటే ఆ రుచి మరచిపోలేము.

 

 

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE