కాకర గాయను చూడగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. రుచికి చేదుగా,  ఒంటినిండా చిన్ని చిన్ని బుడిపెలతో ఉండే కాకర కంటికి ఇంపుగా ఉండదేమో గానీ అయితే దాని రుచి, అది అది చేసే మేలు తెలుసుకుంటే మాత్రం రుచి చూడకుండా  వదిలిపెట్టరు. మధుమేహ నియంత్రణ నుంచి హాంగోవర్  తగ్గించటం వరకు పలు రకాలుగా  కాకర ఉపయోగపడుతుంది. ముదురు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉండే కాకర, దక్షిణాది వారికి ఏంటో ప్రియమైన కాయగూర. కాకరగాయ వేపుడు తెలియని, ఇష్టపడని వారుండరంటే ఆశ్చర్యం లేదు. అడవుల్లో, జన సంచారం తక్కువగా ఉండే చోట పడి  మొలిచే ఆకాకర లేదా బొంత కాకరను కూడా తెలుగు వారు అత్యంత ఇష్టంగా తింటారు. ఆరోగ్యపరమైన అంశాలకు ప్రాధాన్యం పెరిగేకొద్దీ కాకర వినియోగం బాగా పెరుగుతోంది .  

వ్యాధి నివారణ

మితిమీరిన బరువుతో బాధపడే వారు కాకర తింటే బరువు అదుపులోకి రావటంతో బాటు మదుమేహం, రక్తపోటు వంటి సమస్యలూ అదుపులోకి వస్తాయి . ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు కాకర, తులసి ఆకులను సమపాళ్ళలో కలిపి నూరి దానిని తేనెతో సేవిస్తే సమస్య అదుపులోకి వస్తుంది. కలరా లక్షణాలున్న వారికి కాకర రసం ఇస్తే  వెంటనే సమస్య అదుపులోకి వస్తుంది. క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకొనే గుణం కాకరకు ఉందని పలు పరిశోధనల్లో కూడా  రుజువైంది.

నేత్ర సంరక్షణ

కాకర లోని బీటా కెరోటిన్ ఉంటుంది. అందుకే తరచూ కాకరను రుచిచూసే వారికి నేత్ర సంబంధిత సమస్యలు  అంతగా రావు.

విషాలకు విరుగుడు

రక్తంలో చేరిన మాలిన్యాలు, కాలేయంలో పేరుకు పోయిన వ్యర్ధాలను కాకర వదిలిస్తుంది . అందుకే కామెర్లతో బాధ పడేవారు కాకర గాయ తింటే వేగంగా స్వస్థత చేకూరుతుంది .

చర్మ వ్యాధులకు మందు

కాకర సొరియాసిస్ మొదలు కాలి వేళ్ళ మధ్య చేరిన ఫంగస్ వరకు ఉన్న పలు చర్మ వ్యాధుల చికిత్సలలో ఉపయోగపడుతుంది. తరచూ కాకరగాయ తినే వారికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్  రావు . కాకరలోని విటమిన్ సి మూలంగా చర్మం కాంతిలీనుతుంది. కాకర వినియోగం వల్ల  చిన్న వయసులోనే కనిపించే వృద్దాప్య లక్షణాలు దూరమవుతాయి . కాకర తినేవారిలో జుట్టు బలంగా, చుండ్రు లేకుండా ఉంటుంది. జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

మెరుగైన జీర్ణక్రియకు

మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను పారదోలే శక్తి కాకరకు ఉంది . పొట్టలోని నులి పురుగులకు కాకర ఆకు టీ, కాకర రసం చక్కని విరుగుడు .

నోట్: మితం తప్పితే అమృతం అయినా విషమే అన్నట్లు కాకరను కూడా అతిగా  తినకూడదు.

        గర్భవతులు కాకర తినక పోవటమే మంచిది .

        మధుమేహ నివారణ పేరుతో  అతిగా కాకర తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు ఒక్కసారే తగ్గే ముప్పు ఉంది .

           కాకర రసం తాగినప్పుడు గుండె వేగం ఎక్కువై, గుండె గదుల్లోని రక్తం ఒకవైపు చేరి గుండె పోటుకు దారి తీసే ప్రమాదం ఉంది  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE