మన వంటకాల్లో వాముకు ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన రుచి, వాసన దీని ప్రత్యేకతలు. పలు జీర్ణ, శ్వాస సమస్యలకు, నొప్పులకు వాము చక్కని ఔషధం. వాము మొక్క వేరు నుంచి కాండపు చివరివరకు ప్రతి భాగమూ ఔషధంగా పనిచేస్తుంది. వాములోని ఔషధీయ గుణాలు ఆరోగ్యానికి ఎంతగా దోహదం చేస్తాయో తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రదాయిని

 • వాములో విరివిగా లభించే పీచు, ఖనిజలవణాలు, విటమిన్లు, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగటంతో బాటు దెబ్బతిన్న జీవక్రియలూ పుంజుకొంటాయి.
 • వాము వాడేవారిలో రక్త ప్రసార వ్యవస్థ పనితీరు మెరుగుపడటమే గాక కొవ్వు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది.
 • వాము పేగుల్లో స్రావాలను పెంచి ఆహారం సులభంగా, వేగంగా ముందుకుకదిలేలా చేసి జీర్ణ వ్యవస్థ మీది ఒత్తిడిని తగ్గిస్తుంది.
 • వాము వాడేవారిలో మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు రావు. ఉన్నా తగ్గుతాయి.
 • వాముపొడి, రాతి ఉప్పు బాగా కలిపి నూరి రోజూ కొద్దిగా తీసుకొంటే ఎసిడిటీ తగ్గుతుంది.
 • వాము, జీలకర్ర, అల్లం పొడి కలిపి తీసుకొంటే అజీర్తి దూరమై ఆకలి పుడుతుంది. దంచిన వామును నిమ్మరసంలో వేసుకుతాగితే తేపులు. కడుపుబ్బరం తగ్గుతాయి.
 • ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని బయటకు పంపేందుకు, అధిక రక్తపోటును అదుపు చేసేందుకు వాము ఉపయోగపడుతుంది.
 • ఆస్తమా, జలుబుతో ఛాతీ పట్టేయటం, బ్రాంకైటిస్ ల మూలంగా ఇబ్బందిగా ఉంటే కప్పునీటిలో అరచెంచా వాము, చిటికెడు పసుపు వేసి మరిగించి చెంచాడు తేనె కలిపి తీసుకొంటే సరి. లేదా మజ్జిగలో వాముపొడి కలిపి తాగినా శ్వాస కోశ సమస్యలు ఉపశమిస్తాయి.

చిట్కా వైద్యంగా..

 • వరుసగా 3 రోజులు వాము నమిలితే కడుపులోని నులిపురుగులు పడిపోతాయి.
 • ఆగని వెక్కిళ్ళతో ఇబ్బందిగా ఉంటే..పచ్చి వాము నమిలి నీళ్లు తాగితే సరి.
 • పిప్పి పన్ను నొప్పి వేధిస్తుంటే వాముపొడి, నువ్వులనూనె కలిపి పిప్పిపన్నుపై పెడితే సరి.
 • కొద్దిగా వేయించిన వాము వాసన పీల్చటం లేదా నీటితో నూరి నుదిటి రాసుకొంటే మైగ్రైన్ తలనొప్పి తగ్గుతుంది.
 • సైనసైటిస్ కారణంగా వచ్చే తలనొప్పికి వాము మంచి నివారిణి.

ఔషధీయ వాము తైలం  

 • వాము తైలం రాస్తే బిగదీసుకుపోయిన కండరాలు, కీళ్లు సాధారణ స్థితికి వస్తాయి.
 • ఫంగస్ నివారిణిగా పనిచేసే ఈ తైలం చెవిపోటుకు చక్కని ఔషధం.

గమనిక

 • వాముకు పేగుల్లో స్రావాలు ఎక్కువ చేసే లక్షణం ఉన్నందున అల్సర్లు, పేగు సమస్యలున్నవారు దీన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE