చిరుధాన్యాల్లో రాగులది ప్రత్యేకమైన స్థానం. ఒకప్పుడు దక్షిణ భారతంలో ప్రధాన ఆహార పంటగా ఉన్న రాగులను చిరుధాన్యాల రారాజుగా  చెబుతారు. అయితే గత మూడు దశాబ్దాలుగా నీటి పారుదల సౌకర్యాలు పెరిగి,  వరి  పంట సాగు ఎక్కువ కావటంతో వర్షాధారంగా పెరిగే రాగుల వంటి ఎన్నో చిరుధాన్యాలు కనుమరుగవుతూ వచ్చాయి . అయితే గత కొన్నేళ్లుగా పెరుగుతున్న జీవన శైలి రోగాలు, ప్రజల్లో ఆహారం  విషయంలో పెరుగుతున్న అవగాహన వంటి కారణాల వల్ల ఈ చిరుధాన్యాలకు విశేష ఆదరణ లభిస్తోంది. రాగుల వినియోగం రాయలసీమ జిల్లాలతో బాటు  మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో ఇప్పటికీ ఎక్కువగా కనిపిస్తుంది. రాగి రొట్టె , జావా, సంకటి..ఇలా ఏ రూపంలో తీసుకున్నా మంచిదే . చౌకగా లభించటమే గాక సులభంగా, త్వరగా కోరుకున్న ఆహారంగా చేసుకోవచ్చు.  ఉరుకులు, పరుగులకు అలవాటు పడి, అల్పాహారానికి స్వస్తి చెప్తున్న వారు రోజూ ఓ గ్లాసు రాగి జావా తాగినా చాలనేది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట.

ప్రత్యేకతలు

 • రాగుల్లో పుష్కలంగా లభించే పీచు కారణంగా రోజూ రాగి జావను మజ్జిగ లేక పాలతో తీసుకునే వారికి జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
 • రోజూ రాగి జావను తీసుకుంటే కడుపులో మంట తగ్గటంతో పాటు ఒంటికి చలువ చేస్తుంది.
 • వేసవిలో అయ్యే విపరీతమైన దాహార్తిని రాగి జావ తగ్గిస్తుంది.
 • రోజూ రాగి జావ తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
 • సుగంధ పాలతో రాగి జావ తాగితే నాలుగు రోజుల్లో రక్తపోటు అదుపులోకి వస్తుంది.
 • ఖరీదైన డ్రై ఫ్రూట్స్ వంటి వాటిలో లభించే అరుదైన పోషకాలు, ఎమినో ఆమ్లాల వంటివి రాగుల్లో పుష్కలంగా లభిస్తాయి.
 • తిండియావ, ఊబకాయం వంటి సమస్యల బారిన పడిన వారు రాగులతో చేసిన పదార్ధాలు తీసుకుంటే ఆకలి అదుపులోకి వచ్చి, బరువు కూడా తగ్గుతారు.
 • రాగులను ఆహ్హరంలో భాగంగా తినేవారికి హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం , ఆస్థమా వంటి సమస్యలు రావు .
 • పాలుపడని బాలింతలు రాగి జావ తాగితే క్రమంగా పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
 • రాగులకు రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది.
 • ఎదిగే పిల్లలకు అవసరమైన కాల్షియమ్, ఐరన్ రాగుల్లో పుష్కలంగా లభిస్తుంది.
 • రాగుల్లోని అయోడిన్ థైరాయిడ్ సమస్యలకు చెక్ పెడుతుంది.
 • నల్లని, ఒత్తైన కురులు కోరుకునే వారు రాగులను తప్పక ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
 • రాగులతో చేసే ఆహారం నెమ్మదిగా జీర్ణమై, రక్తంలోని చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం లేనందున, మధుమేహులకు ఇది మేలైన ప్రత్యామాయం.
 • కాయకష్టం చేసేవారు, ఆటగాళ్ళు రాగి పదార్ధాలు తీసుకుంటే తక్షణ శక్తి పొందుతారు.
 • రాగి వంటకాలు తీసుకునే వృద్ధులు, మహిళలు, చిన్నారులకు రక్తహీనత, ఎముకలు పెలుసుబారటం వంటి బారిన పడటం వంటి సమస్యలు రావు .Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE