పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు తీసుకోదగిన దక్షిణాది అల్పాహారం ఇడ్లీ. అయితే ప్రస్తుతం సాధారణ ఇడ్లీకి బదులు రాగి పిండి ఇడ్లీని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణ ఇడ్లీ కంటే రాగి ఇడ్లీ పోషకాలపరంగానూ మెరుగైనది కావటమే ఈ మార్పుకు కారణం. రోజూ ఒకేలా ఉండేలా ఇడ్లీ తినాలంటే ఇబ్బందిపడేవారికీ ఇప్పుడు ఇదో మంచి ప్రత్యామ్నాయం. రాగిఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకొందాం. వారానికి 2 రోజులైనా దాని రుచిని ఆస్వాదిద్దాం. రాగుల్లోని మేలైన పోషకాలను అంది పుచ్చుకొందాం.
కావలసినవి
ఇడ్లీ రవ్వ- 1 కప్పు
రాగి పిండి- 2 కప్పులు
మినపప్పు- అరకప్పు,
మెంతులు- 1 చెంచా
ఉప్పు-రుచికి తగినంత
చేసే పద్దతి
ముందురోజు సాయంత్రం మినపప్పు, మెంతులు కలిపి నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి రాగి పిండి, ఇడ్లిరవ్వ, ఉప్పు కలుపుకొని రాత్రంతా పులియబెట్టాలి. ఆ గిన్నెకు మూతగా ఒక గుడ్డకట్టి బయటే ఉంచాలి. ( ఫ్రిజ్ లో పెట్టొద్దు). ఈ పిండిని చేజారుగా కలిపి ఉదయాన్నే ఇడ్లీ పాత్రల్లో వేసుకొంటే వేడివేడి రాగిపిండి ఇడ్లీ సిద్దమైనట్లే.