దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. దీని ఉపయోగాలు ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ అన్నీ పనికొచ్చేవే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగ విశేషాలను గురించి తెలుసుకుందాం. మునగ శాస్ర్తీయ నామం ‘మొరింగ బలిఫెర’ ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా, తొందరగా పెరిగే మొక్కలలో ఇది ఒకటి. 5000 సంవత్సరాల క్రితమే మునగ వాడుకలో ఉంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా, ఎరువుగా కూడా దీన్ని వాడతారు.  వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూలించి, నీటిని శుద్ధి చేయొచ్చు. పెరడు వున్న వాళ్లు మునగ కొ మ్మలను నాటితే ఆరు నెలలకే కాయలు వస్తా యి. హైబ్రిడ్‌ రకాలైతే మరీ ఎత్తు పెరగకుండా కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తినవద్దనలేదు.  భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే మునగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే.
సాగు వివరాలు
 అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగిన మునగ 9-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అయితే అధిక దిగుబడి కోసం ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరిస్తారు. కొమ్మలు కొందికి వాలినట్లు వుండి దృఢంగా వున్నా కూడా చిన్న గాలులకు, తాకిడికి సైతం విరిగిపోతుంటాయి. కాయలు మూడు పలకలుగా 50 సెంటీ మీటర్ల పొడువు, 1-2 సెంటీ మీటర్ల వెడల్పు వుండి కాడల్లా వుంటాయి. అందుకే ములగకాడ అని కూడా అంటారు.

నీటిశుద్ధి ప్రక్రియ
విత్తనాలతో నీటిని శుద్ధి చేసే ప్రక్రియలలో  మునగ విశేషంగా ఉపయోగపడుతుంది. మునగ విత్తనాలను తీసి బాగా మెత్తగా రుబ్బి శుద్ధి చేయాల్సిన నీటిలో బాగా కలిపి ఒక గంట సేపు ఉంచితే విత్తనాల అవశేషాలతో బాటు  బాక్టీరియా, మలినాలు అడుగుకు చేరుతాయి..
మునగలోని పోషకాలు : 
 మునగలో విటమిన్‌ ఎ, సి, సున్నము, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మునగ ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో సున్నము 440 మిల్లీ గ్రాములు, ఐరన్ 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.  మునగవేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్‌ వ్యాధుల చికిత్సల్లోనూ ఉపయోగపడుతుంది.  మునగ ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. మునగాకు పశువులకు ఆహారంగా ఇస్తే పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుంచి కారే జిగురును బఠానీ గింజ పరిమాణంలో 2 ఉండలుగా చేసుకుని మింగితే ఎంతటి విరేచనమైనా కట్టుకుంటుంది.  వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌందర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు. 

ఇతర అంశాలు

  • మునగ కాడల్లోని గుజ్జు మాత్రం తిని కాడలను పక్కనబెట్టటం వల్ల సగం పోషకాలే అందుతాయి. అందులోని పీచును కూడా అందిపుచ్చుకోవాలంటే కాడను నమలాల్సిందే.
  • రుచికి బాగున్నా, వేడిచేసే స్వభావం ఉన్న మునగను పరిమితంగా తీసుకోవాలి .Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE