మన కూరగాయల్లో పెద్దగా గుర్తింపులేని వాటిలో క్యాప్సికమ్‌ ఒకటి. దీన్నే ఆంగ్లంలో 'బెల్‌పెప్పర్‌' అంటారు. కన్ను చెదిరే రంగు, పొందికైన రూపం, బోలెడన్ని పోషకాలుండే క్యాప్సికమ్‌ వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందులోని విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని పలు పరిశోధనల్లో సైతం తేలింది. రోజువారీ ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవటం ద్వారా కలిగే ఉపయోగాలు.. 

  • క్యాప్సికమ్‌లోని 'కేయాన్‌' అనే పదార్ధం నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌, రుమటాయిడ్స్‌ బాధితులు దీన్ని రోజూ తీసుకోవటం వల్ల నొప్పుల బెడద తగ్గుతుంది.
  • క్యాప్సికమ్‌ లోని 'కేప్ససియన్స్‌' రక్త కణాలతో కలిసిపోయి క్యాన్సర్‌ రాకుండా చూస్తాయి.
  • శరీరంలోని అదనపు కేలరీలను తగ్గించి, శరీరబరువును అదుపులో ఉంచడానికి క్యాప్సికమ్‌ వినియోగం తోడ్పడుతుంది. గుండె రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
  • క్యాప్సికమ్‌లోని 'విటమిన్‌-ఏ' మూలంగా నేత్ర సమస్యల ముప్పు ఉండదు.
  • క్యాప్సికమ్‌ వినియోగం చర్మాన్ని తాజాగా ఉంచటమే గాక మొటిమల సమస్య రాకుండా చేస్తుంది.
  • మధుమేహుల రక్తంలోని చక్కెర స్థాయిలను క్యాప్సికమ్‌ అదుపులో ఉంచుతుంది.
  • జుట్టురాలటం, కళ తప్పటం వంటి సమస్యలకు క్యాప్సికమ్‌ వినియోగం మంచి పరిష్కారం.
  • క్యాప్సికమ్‌ వినియోగంతో డయేరియా, పొత్తికడుపు నొప్పి, అల్సర్ల వంటి పలు సమస్యలు దూరమవుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE