ఎవరైనా కొత్త మనిషిని చూడగానే ముందుగా ఆకర్షించేవి కళ్ళే. మనసులోని భావాలను కళ్ళు స్పష్టంగా వెల్లడిస్తాయి. విశాలమైన, కాంతివంతమైన కళ్ళు ఉన్నప్పుడే అసలైన అందమని పెద్దలు భావిస్తారు. రోజువారీ జీవితంలో నేత్ర ప్రాధాన్యాన్ని గుర్తించబట్టే 'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' వంటి మాట వచ్చింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఆ వివరాలు..

  • కంటి ఆరోగ్యం కోరేవారంతా ఏడాదిపొడవునా లభించే పుల్లని పండ్లు తీసుకోవాలి. వీటిలో విరివిగా ఉండే విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలోని కార్నియా పనితీరును పెంచుతాయి. దీనివల్ల త్వరగా కాటరాక్టు అవసరం రాదు.
  • కేరట్లలో విరివిగా లభించే బీటా కెరోటిన్, విటమిన్‌-ఎ రెటీనాను కాపాడుతాయి. ముఖ్యంగా ఉడికిన కేరట్లు వారంలో ఎన్నిసార్లు తింటే కళ్లకు అంత మంచిది.
  • కంటి ఆరోగ్యం కోరేవారంతా చేపలను తినాలి. ముఖ్యంగా ట్యూనా వంటి చేపల్లో విరివిగా లభించే ఒమేగా-3 ఫాటీ ఆమ్లం కంటిజబ్బులను దూరం చేయటమే గాక రెటీనా పనితీరును పెంచుతుంది.
  • రాత్రివేళ మెరుగైన కంటిచూపు కోరేవారంతా తప్పక బ్లూబెర్రీస్‌ తినాల్సిందే. వీటిలో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్, విటమిన్‌-సి కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ల అలసటను పోగొట్టి ఉపశమనాన్నిస్తాయి.
  • పాలకూరలో ఎక్కువ మొత్తంలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్స్‌ కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల చురుకైన కంటిచూపు లభిస్తుంది. అందుకే రోజూ ఎంతోకొంత పాలకూరను సలాడ్స్‌, కూర, పప్పు రూపంలో తినటం మంచిది.
  • గుడ్డులోని విటమిన్‌-ఎ మొదలు పలు ఇతర కీలక పోషకాలు వయసుతోపాటు వచ్చే మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి రెటీనా వ్యాధులు రాకుండా కాపాతాయి.
  • బ్రకోలిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి రెటీనా పనితీరును రెట్టింపు చేస్తాయి. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణా లభిస్తుంది.
  • మొక్కజొన్నలోని ల్యుటిన్‌ వంటి పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడి మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి రెటీనా వ్యాధులను నిరోధిస్తాయి. మొక్కజొన్నను ఎదో రూపంలో రోజుకు 5 - 8 గ్రాములు తింటే చిన్న వయసులో శుక్లాల సమస్య రాదు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE