విలువైన పోషకాలున్న పప్పుధాన్యాల్లో శనగలు ముఖ్యమైనవి. బాదంతో స‌మాన‌  పోష‌కాలున్న శనగలని నానబెట్టి తిన్నా, ఉడికించి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. శనగలను ఉడికించి స్నాక్స్ గా ఇస్తే  తిండి విషయంలో పేచీ పెట్టే పిల్లలు సైతం వద్దనకుండా తింటారు. ఉదయాన్నే మొలకల రూపంలో, చపాతీ, పూరీ కుర్మాగా లేదా  రోజూ గుప్పెడు వేయించి తిన్నా ఎంతో ఆరోగ్యం. పోషకాల పరంగా విలువైన శనగలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకొంటే చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఉపయోగాలు

 • రోజూ గుప్పెడు శనగలు తింటే వీటిలోని ప్రొటీన్ల మూలంగా శరీర అవసరాలకు తగిన శక్తి సమకూరుతుంది.
 • శనగల వినియోగం శరీరపు రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది.
 • శనగల్లోని మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.
 • శనగల మొలకల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
 • మధుమేహులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 • శనగలలో ఉండే ఐరన్ మూలంగా మహిళల్లో కనిపించే రక్తహీనత సమస్య దూరమవుతుంది.
 • రక్తపోటు బాధితులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే వాటిలోని పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాల మూలంగా రక్తపోటు అదుపులో ఉండటమే గాక హృదయ సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది.
 • మాంసం తిని అరిగించుకోలేని వారు శనగలు తిన్నా మాంసంతో సమానమైన ప్రోటీన్లు లభించినట్లే.
 • శనగల్లోని ఎమినో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదల, ప్రసారానికి దోహదపడతాయి.
 • శనగల వినియోగంతో శరీరంలోని అధిక కొవ్వును కరగటమే గాక చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
 • శనగలు తిన్నప్పుడు చాలా సమయం ఆకలికాదు. కనుక బరువు తగ్గించుకోవాలనుకొనే వారు రోజూ గుప్పెడు నానిన శ‌న‌గ‌లు తినొచ్చు.  
 • నిద్రలేమి, ప‌చ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల వినియోగం మేలు చేస్తుంది.

వంద గ్రాముల శనగలలో

పిండిపదార్ధాలు - 61.2 శాతం,

కొవ్వు - 5.3 శాతం

మాంసకృత్తులు - 17.1 శాతం

కాల్షియం - 190 మి.గ్రా

మెగ్నీషియం - 168 మి. గ్రా 

ఐరన్  - 9.8 శాతం

సోడియం - 71 మి.గ్రా ,

పొటాషియం - 322 మి.గ్రా,

పీచు - 3.9 మి.గ్రా

శక్తి - 361 కేలరీలుRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE