పండుగవేళ పూజలో భాగంగా దేవునికి తీపిని నివేదించటం సంప్రదాయం. సాధారణంగా పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఉగాది సందర్భంగా చక్కెర పొంగలి తయారీ విధానం ఎలాగో తెలుసుకొందాం. 

కావలసినవి

బియ్యం - 1 కప్పు, పెసర పప్పు - అరకప్పు, బెల్లం తరుగు - పావు కప్పు, పంచదార - కప్పు, నెయ్యి - పావుకప్పు, జీడిపప్పు - 10, కిస్మిస్ – 10, యాలకుల పొడి - కొంచెం, పచ్చకర్పూరం- చిటికెడు 

తయారీ పద్దతి

ముందుగా బియ్యం ,పెసర పప్పు కడిగి అరగంట నానబెట్టుకొని గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. బెల్లంలో నీళ్లు పోసి వడకట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన బియ్యం, పెసర పప్పు లో పంచదార ,బెల్లం నీళ్లు పోసుకుని 10 నిముషాలు ఉడికించి దగ్గరగా అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కొంచెం యాలకుల పొడి వేసి కొంచెం నెయ్యి, పచ్చకర్పూరం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు.

 Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE