వాసన కారణంగా చాలామంది క్యాబేజీని ఇష్టపడరు. క్యాబేజీ ఒక ఆకుకూర అనికూడా చాలామందికి తెలియదు. దీనిలోని విలువైన పోషకాలు మేలైన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడటమే గాక చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. క్యాబేజీ వినియోగం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల వివరాలు... మీకోసం. 

  • క్యాబేజీలో అధికంగా ఉండే క్యాల్షియమ్‌ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక వాటిని బలోపేతం చేస్తుంది.
  • అధిక రక్తపోటును క్యాబేజీ వినియోగంతో నియంత్రించవచ్చు.
  • ఒంట్లో చేరిన వ్యర్థాలు, హానికారక రసాయనాలను క్యాబేజీ బయటికి పంపి శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి చక్కని యాంటీ ఆక్సిడెంట్. ఇది నారింజలో కంటే క్యాబేజి లో ఎక్కువగా లభిస్తుంది. తరచూ క్యాబేజీ తినేవారికి క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎంత వయసు పెరిగినా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.
  • క్యాబేజీలోని గ్లుటామైన్‌ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌ అలర్జీలు, నొప్పి,వాపులను తగ్గిస్తుంది.  గాయాలు త్వరగా మానేందుకు దోహదపడుతుంది.
  • క్యాబేజీలోని బీటాకెరటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే గాక ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నివారణకు దోహదపడుతుంది.
  • క్యాబేజీలో తక్కువ కేలరీలు ఉంటాయి గనుక ఇది స్థూలకాయులకు, అధిక బరువు బాధితులకు ఇది మంచి ఆహారం.
  • మెదడు ఆరోగ్య పరిరక్షణ, నరాల మీది మైలీన్‌ షీత్‌ అనే పొరను కాపాడటానికి క్యాబేజీ వినియోగం ఎంతగానో దోహదపడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు తగ్గేందుకూ క్యాబేజీ వినియోగం దోహదపడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE