ఎండాకాలం రాకమునుపే మార్కెట్లో ద్రాక్ష పండ్ల రాక మొదలవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ద్రాక్ష వైటిస్ ప్రజాతికి చెందిన పండ్ల మొక్క. ఇందులో సుమారు 60 రకాలున్నాయి. కమ్మని రుచి తో బాటు శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలను ద్రాక్ష అందిస్తుంది. తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష... రంగేదైనా కానివ్వండి. తినడానికి రుచిగా ఉండటమే కాదు సౌందర్యపోషణలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ద్రాక్షపండ్లు సహజక్లెన్సర్లుగా పనిచేసి చర్మంపై ఉండే మురికిని పోగొడతాయి.

ఆరోగ్యానికి :

 • ద్రాక్ష పండ్లకు గుండె సమస్యల్ని దూరం చేసే శక్తి ఉంది. ద్రాక్షలోని ఫైటోకెమికల్స్‌ గుండె కవాటాలు పాడవకుండా కాపాడతాయి.
 • రక్తపోటుతో ఇబ్బంది పడేవారు రోజూ గుప్పెడు నల్ల ద్రాక్ష తినడం మంచిది.
 • రోజూ ద్రాక్షపండ్లు తినేవారిలో కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుంది.
 • ద్రాక్షలో తక్కువ గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంటుంది.
 • తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్షలోని సుగుణాలతో ఉపశమనం లభిస్తుంది.
 • ద్రాక్షలోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్ధాలను పంపుతాయి.

సౌందర్యం 

 • ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేసి మేనిని కాంతిమంతం చేస్తాయి.
 • జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.
 • చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 • ఎండల్లో తిరగటం వల్ల వాడిపోయిన ముఖానికి ద్రాక్ష గుజ్జు, తేనె మిశ్రమం రాసి పావుగంట పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేస్తే ముఖం మీది మురికి పోవటమే గాక ఎండ తాలూకు ప్రభావం కూడా తొలగిపోతుంది.
 • రెండు పెద్ద సైజు తెల్ల ద్రాక్ష పండ్లను నిలువుగా కోసి ఆ ముక్కలతో ముఖమంతా సున్నితంగా రాయాలి. కంటి కింది భాగం, పెదవుల వంటి చర్మం ముడుతలు పడే భాగాలలో మరింత సేపు మసాజ్ చేసి పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగి పొడి గుడ్డతో తుదుచుకుంటే వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు దూరమవుతాయి.
 • రెండు చెంచాల ద్రాక్షరసానికి టేబుల్‌స్పూన్‌ చొప్పున పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే ముఖచర్మం  మృదువుగా మారుతుంది. 
 • పొడి చర్మం ఉన్నవారు చెంచాడు ద్రాక్ష రసానికి గుడ్డు  పచ్చసొన కలిపి ముఖానికి రాసి పదినిమిషాల తర్వాత చల్లటినీళ్లతో కడుక్కుంటే చర్మానికి తగినంత తేమ అందుతుంది.  అదే, మీది జిడ్డు చర్మమైతే పచ్చసొన స్థానంలో తెల్లసొన వాడితే సరిపోతుంది.
 • విద్యార్థులు తరచూ ద్రాక్ష పండ్లు తింటే మెదడు చురుగ్గా పనిచేయటమే గాక మతిమరపు వంటి సమస్యలూ దూరమవుతాయి.
 • ద్రాక్ష పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడతాయి.
 • నల్లద్రాక్షలో పుష్కలంగా లభించే ఫాలిఫినాల్స్ క్యాన్సర్‌ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి .
 • రోజూ కిస్ మిస్ తినేవారిలో ఆస్టియోపోరోసిస్‌ సమస్య రాదు.
 • రోజూ కిస్ మిస్ లను పాలల్లో వేసుకొని తింటే కంటి చూపు మెరుగవుతుంది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE