• మొద్దుబారిన మిక్సీ బ్లేడ్ పదునుగా మారాలంటే చెంచాడు కల్లు ఉప్పు  వేసి తిప్పితే సరి.
  • సీసాలో గడ్డకట్టిన తేనె పలచబడాలంటే సీసాను వేడినీటిలో అయిదు నిమిషాలు ఉంచితే చాలు.
  • కూరగాయలు తరిగేటప్పుడు వేలు తెగినా, వేడి పాత్ర తగిలి చర్మం కమిలినా తాజా కలబంద గుజ్జు రాస్తే మరునాటికే మానిపోతుంది.
  • రాత్రి కలిపిన ఇడ్లీ పిండిని ఉదయం ఇడ్లీ పాత్రలో వేసేటప్పుడు ఎక్కువగా కలిపితే ఇడ్లీ గట్టిగా వస్తాయి గనుక పిండిని అలాగే పాత్రలో వేసుకోవాలి.
  • టిఫిన్ బాక్స్ , నీళ్ళు పడి వాసన వస్త్తున్న హ్యాండ్ బాగ్ లో రోజ్ వాటర్లో ముంచిన దూదిని ఉండలుగా చుట్టి రాత్రంతా పెడితే వాసన తొలగి పోతుంది 
  • దోసె పిండి రుబ్బేప్పుడు కాసిని నానబెట్టిన మెంతులు కలిపితే దోశ మృదువుగా రావటమే గాక  బంగారు రంగులో మెరుస్తుంది.
  • చికెన్‌ వండేటప్పుడు పైపొర చర్మాన్ని తొలగించటంతో బాటు తక్కువ నూనె వాడితే హానికరమైన కొవ్వు తగ్గిపోతుంది.
  • పప్పు వండటానికి అరగంట ముందు కందిపప్పును నానబెట్టి, చెంచాడు నూనె వేసి వండితే పప్పు త్వరగా వుడకటమే గాక రుచిగానూ ఉంటుంది.
  • ఆకు కూరలు, కూరగాయలు వండేటప్పుడు అరచెంచాడు చక్కెర చేర్చితే రంగును కోల్పోకుండా చూడొచ్చు.
  • పచ్చి కరివేపాకును రోజూ పది ఆకులు తింటే జుట్టు రాలదు. 
  • జలుబు బారిన పడితే అల్లం రసం , నిమ్మ రసం, తేనె సమపాళ్ళలో కలుపుకుని తాగితే సత్వర ఉపశమనం కలుగుతుంది .
  • పచ్చి కొబ్బరిచిప్పని అయిదు నిమిషాలు వేడినీటిలో ఉంచి తీసి బోర్లా పెట్టి కొడితే మొత్తం కొబ్బరి ఒకటే చిప్పగా వస్తుంది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE