• పాలలోని మీగడ పూర్తిగా రావాలంటే పాల గిన్నె మీద మందపాటి ముస్లిన్‌ క్లాత్‌ కప్పి ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచితే సరి.
 • వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు కొద్దిగా వేడి చేసి తరువాత తీస్తే పొత్తు పూర్తిగా, సులభంగా వస్తుంది.
 • మిక్సీ జార్‌లో కొద్దిగా రాతి ఉప్పు వేసి తిప్పితే వాటి బ్లేడ్లు మరింత పదునెక్కుతాయి.
 • వంట గది మూలల్లో కొద్దిగా బోరిక్‌ పౌడర్‌ చల్తి బొద్దింకలు రావు.
 • కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
 • ఫ్లాస్క్‌లో కాసిని మజ్జిగ, ఉప్పు వేసి కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.
 • బొంబాయి రవ్వ ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే రవ్వకు చెంచా నూనె పట్టిస్తే సరి.
 • వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడి వేస్తే మరింత రుచిగా ఉంటాయి.
 • గుడ్డు సొనకు, కొబ్బరికోరు చేర్చి ఆమ్లెట్ వేస్తే మరించ రుచిగా ఉంటుంది.
 • కాచిన సూప్‌కు రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడు అవుతుంది.
 • తరిగిన బంగాళ దుంపలపై వెనిగర్ చల్లితే రంగు మారకుండా ఉంటాయి.
 • తేనె సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవ్.
 • అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
 • బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
 • సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంప వేస్తే సరి.
 • అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి. 
 • వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది. 
 • జిడ్డుగా ఉన్న నాన్‌స్టిక్‌ పాన్‌ మీద కొద్దిగా వేడినీరు పోసి సబ్బు లేదా సర్ఫ్‌తో శుభ్రం చేసుకుంటే జిడ్డు వదిలిపోతుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE