వంట చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కొన్ని అంశాల మీద అవగాహన ఉండాలి. పత్రికలోనో, టీవీలోనో చూసి వంట నేర్చుకొనే వారు ఆయా వంటకాల తయారీ విధానం గురించి తెలుసుకుంటారు గానీ ఏయే పదార్థాలు యెంత వాడాలనే సంగతి దగ్గరకొచ్చేసరికి కాస్త ఇక మక పడుతుంటారు. మరీ ముఖ్యంగా టీ స్పూన్‌, టేబుల్‌ స్పూన్‌, కప్పు వంటి పరిమాణాల విషయంలో కాస్త స్పష్టత ఉంటే ఏ మాత్రం అనుభవం లేకున్నా రుచిగా  వంట చేసుకోవచ్చు.  ఈ కొలతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెంచా(టీ స్పూన్) : చక్కర తదితరాలకు వంటింట్లో వాడే చిన్న సైజు చెంచాలను టీస్పూన్లుగా పరిగణించవచ్చు.

గరిట( టేబుల్ స్పూన్): అలాంటి మూడు టీస్పున్లు కలిపితే ఒక టేబుల్‌ స్పూన్‌ (గరిట). తూనికల కొలమానం ప్రకారం ఒక టేబుల్‌ స్పూన్‌ పదిహేను గ్రాములుగా పేర్కొంటారు.

 

కప్పు:  పదహారు టేబుల్‌ స్పూన్లు ఒక కప్పుతో సమానం. అదే నాలుగు టేబుల్‌ స్పూన్లు తీసుకుంటే పావు కప్పు అవుతుంది. కప్పుల్లో మూడోవంతు తీసుకోవాలంటే ఐదు టేబుల్‌ స్పూన్లు, పైన కొద్దిగా వేయాల్సి ఉంటుంది. అరకప్పు పొడి ఏదైనా అవసరమైతే సరిగ్గా ఎనిమిది టేబుల్‌ స్పూన్లు తీసుకుంటే చాలు.

 

ఫర్మ్‌లీ ప్యాక్డ్‌ : పిండిలో ముంచిన కప్పును పైన అదమకుండా(నొక్కకుండా)  యెంత వస్తే అంత  తీసుకుంటే దాన్ని ఫర్మ్‌లీప్యాక్డ్‌ అంటారు.

ఈవెన్‌/ లెవల్‌: ఏదైనా పాత్రతో పిండి లేదా ధాన్యాన్ని తలకొట్టి (అంచు వరకే పదార్థాన్ని ఉంచి మిగిలినది తీసేయటం) తీసుకుంటే దాన్ని ఈవెన్‌/లెవల్‌ అంటారు. 

హీప్‌డ్‌ : పాత్ర నిండిన తర్వాత కూడా, పట్టినంత పదార్థాన్ని పైన కుప్పలా పోయటాన్ని హీప్‌డ్‌ అంటారు.

రౌండెడ్‌ : గ్లాసు పిండి కావాలనుకున్నప్పుడు గ్లాసులో పిండి పోసే బదులు గ్లాసునే పిండిలో ముంచి వచ్చిన మేరకు తీస్తే దాన్ని రౌండెడ్‌ అంటాం. ఇది లెవ్‌కి, హీప్‌డ్‌కి మధ్య స్థాయి అన్నమాట.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE