దంపతుల అనురాగానికి ప్రతిరూపమే సంతానం. పుట్టినది మొదలు నవజాత శిశువు అనేక బాలారిష్టాలను అధిగమిస్తూ ఎదగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బిడ్డ ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పసిపిల్ల పెంపకం మీద సరైన అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యం. పసిపిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. 

 • అధిక సంతానం వద్దు. దీనివల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది.
 • 20 నుండి 28 సంవత్సరాల వయసు మధ్యలో గర్భధారణకు అనువైన సమయం ఉంటుంది గనుక ఆడపిల్లకు కనీసం 18 ఏళ్ళు నిండిన తర్వాతే వివాహం చేయాలి.
 • బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం 3 ఏళ్ళు తేడా ఉండేలా చూసుకోవాలి.
 • గర్భం ధరించిన మహిళ ప్రతినెలా వైద్యునిచేత పరీక్షలు చేయించుకోవటంతో బాటు ఆసుపత్రి ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 • గర్భిణిగా ఉన్నప్పుడు మంచి పోషకాహారం తీసుకోవటంతో బాటు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.
 • బిడ్డకు కనీసం 6 నెలల వయసు నిండే వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. 6వ నెల నుంచి పాలతో బాటు తేలికపాటి ఆహారం అందించాలి.
 • మూడేళ్లలోపు పిల్లలకు పప్పు, నెయ్యి, పాలు, గుడ్లు, కూరగాయలు తదితరాలతో కూడిన పోషకాహారాన్ని విధిగా అందించాలి.
 • పిల్లలకు విరేచనాలవుతుంటే రోజూ కంటే ద్రవ పదార్థాలు అధికంగా ఇవ్వాలి. పిల్లలకు కాచి వడపోసి, చల్లార్చిన నీరు మాత్రమే ఇవ్వటం మంచిది.
 • పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మల, మూత్ర విసర్జన తర్వాత, ఆహారం తినే ముందు పిల్లలతో బాటు పెద్దలు సైతం చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడగాలి.
 • పిల్లలు ఏదైనా అనారోగ్యం పాలై కోలుకున్న తర్వాత పూర్వం కంటే ఎక్కువ ఆహారం అందించాలి. 
 • పిల్లల బరువును ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన పోషకాహారం అందించాలి.
 • వైద్యులు సూచించిన సమయానికి ఆయా టీకాలు వేయించాలి.
 • పిల్లలు శ్వాసపీల్చుకోవడం ఇబ్బంది అయితే వైద్య సలహా పొందాలి.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE