మనదేశంలో తులసి మొక్క లేని వీధి గానీ ఆలయం గానీ కనిపించటం అరుదే. వైద్య పరంగా వేదకాలం నుంచి భారత ఉపఖండంలో తులసికి ప్రముఖమైన స్థానం ఉంది. తులసి గాలి తగిలితేనే సమస్త రోగాలు దూరమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఔషధాలకు తల్లిగా, సహజ వనమూలికల్లో రాణిగా తులసి గుర్తింపు పొందింది. వేదాలు, చరక సంహిత, పద్మ పురాణాల్లో తులసి ప్రస్తావన కనిపిస్తుంది. గృహ వైద్యంలో ఉపయోగపడే మేలైన ఔషధుల్లో తులసి ఎన్నదగినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. తులసి ఆకు, కొమ్మ, వేరు, కాండం అన్నీ విశేషమైన ఔషధ గుణాలున్నవే. 

 తులసిని సంస్కృతంలో వైష్ణవి, బృంద, సుగంధ, పవిత్ర, పావని, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ, కృష్ణ వల్లభ, మాధవి, దేవ దుందుభి అనే పేర్లతో పిలుస్తారు. తులసిలో రామ తులసి, కృష్ణ తులసి, భూతులసి, అరణ్యతులసి, లక్ష్మీ తులసి వంటి పలు రకాలున్నాయి. లెక్కకు మించిన ఔషధ గుణాలున్నాయి గనుకే తులసి పెంపకాన్ని మన పూర్వీకులు ఇంటింటా ప్రోత్సహించారని చెప్పొచ్చు. 

ఉపయోగాలు

 • తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ లక్షణాల వల్ల దగ్గు, జలుబు , జ్వరం బాధితులు పరగడుపునే అయిదారు తులసీ దళాలు తింటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
 • వేడినీటిలో లేక టీ డికాక్షన్ లో గానీ తులసి దళాలను వేసి, ఆ కషాయానికి యాలకుల పొడి కలుపుకు తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గి అనారోగ్యం తాలూకూ అలసట దూరమవుతుంది.
 • అల్లం రసం, తేనె, తులసి ఆకులు కలిపిన టీ తాగితే ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంఫ్లుయంజా వంటి తీవ్రమైన శ్వాశకోశ సమస్యలు ఉపశమిస్తాయి.
 • రోజూ తులసి తీర్థం తాగితే మానసిక ఒత్తిడి, నొప్పులు దూరమవుతాయి. తులసి అత్యుత్తమ నొప్పి నివారిణి అని ఎన్నో ఆధునిక పరిశోధనల్లో తేలింది.
 • తులసిలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల గాయాలు త్వరగా నయం అవుతాయి.
 • నడివయసు మోకాళ్ళ నొప్పి, కడుపుబ్బరం( గ్యాస్) వంటి సమస్యలకు తులసి చక్కని మందు.
 • రోజూ తులసిని తీసుకొనే వారిలో అందులోని విటమిన్ ఎ, సి తోబాటు యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ మూలంగా హృదయ సంబంధిత సమస్యలు చాలావరకు రావు.
 • రక్తపోటు, మధుమేహం నియంత్రణలో తులసి పాత్ర ఎంతో కీలకం.
 • రోజూ 4 తులసీ దళాలు తినేవారిలో మూత్ర పిండాల సమస్యలు రావు. 6 నెలల పాటు తులసి రసంలో తేనె కలుపుకు తింటే కిడ్నీ రాళ్ళు నెమ్మదిగా మూత్రంతో బాటు బయటికి పొతాయి.
 • తులసికి ఆకలిని వృద్ధి చేసే శక్తి ఉంది. 2 వారాలు తులసి రసం, తేనె తింటే మలబద్దకం, నులిపురుగులు,అతిసార, అజీర్తి ,అతిసార, ఎసిడిటీ వంటి సమస్యలు తప్పక దారికొస్తాయి.
 • తులసికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉన్నందున మొటిమలు, ముఖభాగపు కొవ్వు దూరమై చర్మం సుతారంగా తయారవుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE