పాదాల మడమలు పగిలి ఇబ్బందిపెడుతున్నాయా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మడమలు సున్నితంగా మారటం లేదా? ఈ సమస్య కారణంగా హై హీల్స్, చెప్పులు వేసుకొని నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుగా ఉందా? అయితే మీ సమస్యకు గృహ వైద్యంలో చక్కని పరిష్కారం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

  • 2 చెంచాల చొప్పున ఆముదం, కొబ్బరి నూనె తీసుకొని అందులో అర చెంచా పసుపు కలిపి రంగరించి రోజూ పాదాలకు రాసుకొంటే పగుళ్ల సమస్య దూరమవుతుంది.
  • గుప్పెడు వేపాకు, చిటికెడు చొప్పున పసుపు, సున్నం కలిపి మెత్తగా నూరి,  అందులో 2 చెంచాల ఆముదం కలిపి పాదాలకు పట్టిస్తే పగుళ్ల సమస్య నయం అవుతుంది. 
  • గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పాదాలను ఆ నీటిలో ఉంచి తర్వాత ఫ్యూమ్ స్టోన్ తో మడమలు శుభ్రంగా రుద్దితే అక్కడ చేరిన మలినాలు, మృతకణాలు తొలగటమే గాక పగుళ్లు రావు.
  • రోజూ నిద్రకు ముందు పాదాలను కడుక్కుని తుడిచి కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్లు ఏర్పడవు.
  • పగిలి ఇబ్బందిపెడుతున్న మడమలకు గుప్పెడు పండిన బొప్పాయి గుజ్జు లేదా రుబ్బిన గోరింటాకును రాసి బాగా ఎండిన తర్వాత నీటితో కడిగితే మంచి ఉపశమనం లభిస్తుంది.
  • వాన నీటిలో, బురదలో ఒట్టి కాళ్లతో తిరగకుండా ఉండటం, మెత్తని, సౌకర్యవంతమైన చెప్పులు, షూ వాడటం ద్వారా పగుళ్లు లేకుండా చూసుకోవచ్చు.

 

 

 Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE