కిడ్నీసమస్య ఏదైనా రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యకరమైన జీవన శైలితో బాటు ఈ కింది చిట్కాలను పాటించటం ద్వారా నూటికి 90 శాతం మందిలో ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా చూడవచ్చు. అవి..

 • కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారణకు పసుపు చక్కని ఔషధం. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే రసాయనానికి యాంటీ బ్యాక్టీరియల్ మరియు వాపును నివారించే స్వభావం ఉంది. ఇది కిడ్నీకి హానికలిగించే మైక్రోబ్స్ పెరగకుండా చూడటమీ గాక కిడ్నీలోని ఇన్ఫెక్షన్ ను ఒక ప్రాంతానికే పరిమితం చేస్తుంది.
 • అల్లంలోని జింజరోల్ కిడ్నీలో వ్యాప్తి చెందే బ్యాక్టీరియాను అడ్డుకొని ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.
 • ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో బాటు వాపును నివారిస్తుంది. అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారణకు రోజూ కనీసం 3 వెల్లుల్లి రెబ్బలు తినడం మంచిది.
 • పెరుగులోని బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థతో బాటు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చూస్తుంది. ఎప్పటికప్పుడు కిడ్నీలోని మలినాలను బయటకు పంపుతుంది.
 • 2 చెంచాల తేనెలో చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజూ తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ బెడద లేనట్టే.
 • రోజూ 2 కప్పుల హెర్బల్ టీ తాగేవారిలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావు.
 • శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో కలబంద (అలోవెరా) బాగా పనిచేస్తుంది. అందుకే రోజూ కలబంద గుజ్జు తీసుకుంటే కిడ్నీ లో పేరుకుపోయిన వ్యర్ధాలు బయటకు పోతాయి.
 • అధిక ఆమ్ల స్థాయి ఉండే విటమిన్ సి మూలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావు. అందుకే విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ,నారింజ, బత్తాయి, ఉసిరి వంటి ఫలాల్లో ఏదో ఒకటి తినాలి.
 • కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నివారణకు బేకింగ్ సోడా ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అందుకే రోజూ ఒక గ్లాసు నీటిలో అరచెంచా బేకింగ్ సోడా కలిపి తాగాలి.
 • రోజూ గ్లాసు నీళ్లలో ఒక నిమ్మకాయ, చెంచా స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ కలిపి తాగితే కిడ్నీ,కాలేయం, పిత్తాశయంలోని వ్యర్ధాలు బయటకుపోయి కిడ్నీ సమస్యలు రావు. ఆలివ్ ఆయిల్ కిడ్నీరాళ్లను నివారించటమే గాక ఎసిడిటిని నివారిస్తుంది.
 • అతిగా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ సమస్యలు తప్పవు. లేకుంటే కిడ్నీలో రసాయనిక వ్యర్ధాలు పేరుకుపోయి క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతిని పూర్తిగా పాడైపోతుంది.
 • రోజూ ఒక గ్లాసు క్రాన్ బెర్రీ జ్యూస్ తాగితే కిడ్నీ ఇన్ఫెక్షన్ రాదు. ఒకవేళ ఉన్నా త్వరగా అదుపులోకి వస్తుంది.
 • దాహంతో నిమిత్తం లేకుండా రోజుకు కనీసం 5 లీటర్ల నీరైనా తాగాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు కిడ్నీలోని వ్యర్ధాలు, మోతాదుకు మించి చేరిన సోడియం వంటివి మూత్రం రూపంలో బయటకుపోతాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE