• కార్పెట్ లోలోపలికి చేరిన దుమ్ము, ధూళిని పూర్తిగా వదిలించాలంటే ముందురోజు రాత్రి సోడా ఉప్పు కార్పెట్ మీద చల్లి మరునాటి ఉదయం వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే దుమ్ము పూర్తిగా పోతుంది.
  • గోడకు వేలాడదీసిన తైలవర్ణ చిత్రాలు, చెక్క బొమ్మలు, ఇతర చెక్క వస్తువులను శుభ్రం చేసేటప్పుడు వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడిస్తే వాటిపై పడిన మరకలు మాయమై, దుమ్ము, ధూళి పూర్తిగా తొలగి కొత్తవాటిలా మెరిసిపోతాయి.
  • మాంసాహారం, ఉల్లిపాయలు, గుడ్డు, నూనె తదితరాల కారణంగా వంట గది సింక్ వాసన వస్తుంటే అరకప్పు వెనిగర్ ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి సింక్ దగ్గర పెడితే ఆ దుర్వాసనను వెనిగర్ పూర్తిగా పీల్చుకుంటుంది.
  • కిటికీ అద్దాలను బయట వైపు అడ్డంగా, లోపలివైపు నిలువుగా శుభ్రం చేయాలి . దీనివల్ల ఏవైపు సరిగా శుభ్రం అవ్వలేదో తెలుస్తుంది . కిటికీలు బాగా మురికిగా ఉంటే 2 లీటర్ల నీటిలో మూడు చెంచాల వెనిగర్‌ వేసి తుడవండి.
  • బొరాక్స్‌ పౌడర్‌తో ఫ్రిజ్‌ బయటి భాగాన్ని శుభ్రం చేస్తే ఫ్రిజ్ తళతళ మెరిసిపోవాటంతో బాటు బ్యాక్టీరియా దూరమవుతుంది. నిమ్మచెక్క తో కూడా ఫ్రిజ్ తుడవొచ్చు. ఫ్రిజ్ శుభ్రం చేసేటప్పుడు ఆహార పదార్ధాలను సెపరేట్‌ కంటైనర్‌లలో పెట్టటం మరువొద్దు.
  • బాత్‌ రూమ్‌ కడిగే ముందు టైల్స్‌ మీద వేడి నీళ్లు చల్లి ఐదు నిమిషాలు ఆగి బేకింగ్‌ సోడా, నిమ్మరసం మిశ్రమంతో శుభ్రపరచాలి. ఇవి సహజమైన క్లెన్సర్‌లు.టైల్స్‌ మరీ మురికిగా, జిడ్డుగా ఉంటే మిశ్రమానికి కాస్త వెనిగర్‌ కూడా కలపండి.
  • ఒక కప్పు నిమ్మరసంలో ఒక కప్పు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి చెక్క వస్తువులు శుభ్రపరిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి.
  • ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళుపోసి కొద్దిగా దాల్చినచెక్క, గుప్పెడు ఎండిన నారింజ, కమలా తొక్కలు వేసి మరిగిస్తే వంటగది సువాసనా భరితంగా మారుతుంది.
  • వెండి వస్తువులను అరటి తొక్కతో రుద్దటం వల్ల ఆ వస్తువులకు మెరుపు వస్తుంది.
  • తడిచిన లెదర్‌ బ్యాగులూ, చెప్పులను గది ఉష్ణోగ్రతలో ఆరనిచ్చి కొంచెం నూనె రాసి తుడిస్తే ఫంగస్‌ దరిచేరదు.
  • ఇల్లు సర్దటం పూర్తికాగానే నేలను యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్న ద్రావణంతో ప్రతిరోజూ శుభ్రం చేయాలి. 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE