• బిస్కెట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపరు వేస్తే, బిస్కెట్లు ఎన్నాళ్ళున్నా తాజాగా ఉంటాయి.
• ఫ్రిజ్ లో పెట్టిన లేక వడలిన నిమ్మకాయలను 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో వేస్తే త్వరగా మెత్తబడి ఎక్కువ రసం వస్తుంది.
• పనీర్ ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే దాన్ని బ్లాటింగ్ పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.
• బాగా పండిన టొమాటో లను ఉప్పు వేసిన చల్లని నీళ్ళలో రాత్రంతా ఉంచితే తాజాగా మారతాయి.
• జీలకర్ర, లవంగాల వంటి మసాలా దినుసులను సన్నని సెగ మీద వేడిచేసి పొడిచేస్తే తొందరగా, పూర్తిగా పొడి అవుతాయి.
• కర్పూరం డబ్బాలో కొన్ని మిరియాలు వేస్తే కర్పూరం ఎన్నాళ్ళున్నా కరిగిపోదు.
• తేనె చిక్కపడినా లేక గడ్డకట్టినా ఆ సీసాను 5 నిమిషాలు వేడి నీటిలో వుంచితే పలచబడుతుంది.
• అంజీర, జీడిపప్పు, ఖర్జూరాలు వంటి డ్రై ఫ్రూట్స్ ను సులభంగా, కోరిన ఆకారంలో కత్తెరించాలంటే వాటిని అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచి తీసి, వేడినీటిలో 5 నిమిషాల పాటు ఉంచిన చాకుతో కత్తెరించాలి.
• మిక్సీ బ్లేళ్లు మొద్దుబారకుండా ఉండాలంటే అందులో నెలకోసారి గుప్పెడు రాతి ఉప్పు వేసి తిప్పితే సరి.
• అరటి, బొప్పాయి వంటి ఏ కాయలైనా త్వరగా పండ్లుగా మారాలంటే వాటిని పొడి కాగితంలో చుట్టి ఏదైనా గాలి చొరబడని డబ్బా లేక గదిలో 2 రోజులు ఉంచాలి.
• పాలు మరిగేటప్పుడు చిటికెడు సోడాఉప్పు వేస్తే పాలు ఫ్రిజ్ లో పెట్టకపోయినా 2 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
• డీప్ ఫ్రిజ్ లోపల మంచు ఎక్కువగా, త్వరగా పేరుకుపోకుండా ఉండాలంటే అందులో కాస్త ఉప్పు చల్లటం లేక ఉప్పుతో రుద్దటం చేయాలి.
• వాష్ బేసిన్ లేదా సింక్ మూసుకుపోయి నీళ్లు పోకపోతే అందులో అరకప్పు సోడియం బైకార్బొనేట్, ఒక కప్పు వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని సింకులో పోసి 10 నిమిషాల తర్వాత అరకప్పు నీళ్లు పోస్తే గంట తరువాత పైప్ దానంతట అదే తెరుచుకుంటుంది.Recent Storiesbpositivetelugu

ఒత్తిడిని వదిలించే చిట్కాలు 

ఈ రోజుల్లో పట్టణ , నగరవాసులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబ సమస్యలు, 

MORE
bpositivetelugu

కార్తీక నియమాలతో ఆరోగ్యం

మన భారతీయ సంస్కృతి నేర్పే సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమైనవే గాక మంచి ఆరోగ్యాన్నీ అందించేవి. కార్తీకమాస నియమాలే 

MORE