ఇప్పటి రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూస్మార్ట్ ఫోన్ ఒక అవసరంగా మారింది. పాత తరం ఫోన్లతో పోల్చితే ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం సులువు కావటంతో బాటు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో ఎక్కువ మంది పలు సేవలకు, సమాచార సేకరణకూ స్మార్ట్ ఫోన్ నే ఆశ్రయిస్తున్నారు. ఇక యువత సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గంటల తరబడి స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల నేత్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించటం మంచిది. అవి.. 

  • ఫోన్ కొన్నవెంటనే సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్‌ బ్రెట్‌నెస్‌ను తగ్గించుకోవాలి. ఎక్కువ వెలుగుతో కూడిన ఫోన్ తెరను గంటల తరబడి చూడటం మూలంగా కళ్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల చత్వారం(ఐ సైట్), తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. 
  • ఫోన్లోని అక్షరాలను, ఫాంట్లను అవసరమైనట్లు మార్చుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి టెక్స్ట్ సైజ్, క్రాంటాస్ట్‌ను తగినట్లు మార్చుకోవాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు. సమాచార సేకరణ కూడా వేగంగా, సులువుగా జరుగుతుంది. 
  • కొత్త ఫోన్ మీదమంచి నాణ్యత గలిగిన యాంటీ రిఫ్లెక్టివ్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ను అమర్చుకోవటం వల్లకంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 
  • ఫోన్ కు కంటికి కనీసం 15 అంగుళాల దూరంలో పెట్టి చూడాలి. ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ను వాడేటప్పుడు 10 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి.
  • రాత్రివేళల్లో దీపం వెలుగులోనే స్మార్ట్ ఫోన్ వాడాలి. చిమ్మ చీకటిలో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ వాడితే కంటిమీద రెట్టింపు ఒత్తిడి పడుతుంది.
  • స్మార్ట్‌ఫోన్‌ రింగ్ టోన్ వీలున్నంత ఆహ్లాదంగా, మంద్ర స్థాయిలో ఉండాలి తప్ప వినగానే చిరాకు పుట్టించేదిగా ఉండరాదు.
  • రోజూ ఫోన్ స్క్రీన్ ను శుభ్రం చేయటం మరువొద్దు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE