• కాలీప్లవర్ ముక్కలను 2 నిమిషాలపాటు వేడినీళ్ళలో వేస్తే పురుగులు చచ్చి పైకి తేలతాయి. లేదా ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో 2 చెంచాల వెనిగర్ వేసినా పురుగులు పైకి తేలతాయి.
 • నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని ఫ్రిజ్ లో ఉంచటం కంటే ఒక పాత్రలో చల్లని నీరు పోసి అందులో వేయటం మంచిది. అయితే ఆ పాత్రలో నీరు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి.
 • వంకాయలు, అరటి కాయలు కోసినప్పుడు చేదెక్కకుండా వాటిని ఉప్పునీటిలో వేస్తారు. అయితే ఒక్కోసారి ఇలాచేసినా కసరుగా మారతాయి. అందుకే ఈ ముక్కలు కోయగానే కొంచెం మజ్జిగ కలిపిన ఉప్పునీటిలో వేస్తే ముక్కలు రంగు, రుచి మారవు.
 • కూరగాయలు ఉడికించాలనుకుంటే ముక్కలు, నీరు పోసి నేరుగా ఉడికిచటం వల్ల సమయం, ఇంధనం వృధా అవుతాయి. అదే.. మరుగుతున్న నీటిలో కాయగూరల ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతాయి.
 • పచ్చి కొబ్బరి చిప్పలు పాడుకాకుండా ఉండాలంటే చల్లని నీటిలో 2 చెంచాల ఉప్పు వేసి అందులో ఉంచితే సరి. అయితే రోజూ గిన్నెలో నీళ్లు మాత్రం మార్చాలి.
 • చేపలు, కోడి మాంసం, రొయ్యలకు వండేందుకు ముందు ఎక్కువ పసుపు పట్టించి 15 నిమిషాలు ఉంచి తర్వాత ఉప్పుతో కడిగి వండితే నీచు వాసన రాదు.
 • గుడ్డు సొనలో పావు చెంచా శెనగపిండి కలిపి గిలకొట్టి ఆమ్లెట్ వేస్తే చక్కని ఆకారంలో వస్తుంది.
 • వేడిపెనం మీద అడ్డంగా కోసిన ఉల్లిపాయతో రుద్ది దోష వేస్తే అంటుకోకుండా వస్తుంది.
 • పచ్చిమిరపకాయల తొడిమలు తీసి పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే 10 రోజులైనా పాడుకావు.
 • పాలు కాచే గిన్నె పై భాగంలో లోపలి వైపు నూనె రాస్తే పాలు పొంగవు.
 • మూత పెట్టకుండా ఉడికించే ఆహారంలోని విటమిన్ ఎ లోపిస్తుంది. అదే... నీళ్లు ఎక్కువగా పోసి ఉడికిస్తే విటమిన్ బి తగ్గుతుంది. ఆహారాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ ఉడికిస్తే విటమిన్ సి కూడా పోతుంది.
 • అన్నంఉడికేటప్పుడు2 చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది. అదే చెంచా నూనె వేస్తే అన్నం పొడిపొడిగా ఉంటుంది.
 • క్యాబేజీ కూర ఉడికేటప్పుడు ఒక బ్రెడ్ ముక్కను వేస్తే పచ్చివాసన రాదు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE