• వంటగది మూలలలో, అక్కడి అల్మారాల్లో కాస్త బోరిక్ పౌడరు చల్లితే బొద్దింకల బెడద తీరుతుంది.
 • మీ ఇంట్లో బల్లుల బెడద ఉంటే ఒక్కో గదిలో ఒక నెమలి ఈకను వేలాడ కడితే బల్లులు పారిపోతాయి.
 • పాల గిన్నెలో ఒక చెంచా వేసి సన్నని సెగ మీద కాస్తే పాలు అడుగంటవు.
 • ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే 5 పచ్చకర్పూరం బిళ్ళలను కప్పు నీళ్ళలో వేసి అన్ని గదుల్లో పెడితే దోమలు పారిపోతాయి.
 • ఉల్లిపాయలు పాడు కాకుండా ఉండాలంటే ఒక్కో పాయను కాగితంలో చుట్టి గాలి, వెలుతురూ పడని చోట పెట్టాలి
 • బియ్యం డబ్బాలో పేపరులో చుట్టిన బోరిక్ పౌడర్ ఉంచినా లేదా గుప్పెడు పుదీనా ఆకులు వేసినా ఆ బియ్యానికి పురుగు పట్టదు.
 • బట్టల మీద పడిన టీ, కాఫీమరకలు పోవాలంటే ఆ మరకలను ఉప్పుతో రుద్ది ఉతకాలి.
 • సింక్ పైప్ శుభ్రంగా ఉండాలంటే అందులో కప్పు చొప్పున ఉప్పు,బేకింగ్ సోడా వేసి మరిగేనీళ్ళు పోస్తే పైప్ శుభ్రపడుతుంది.
 • గుడ్డు పగిలి సొన కారితే వెంటనే దానిపై ఉప్పు చల్లి 2 నిమిషాలు ఆగి టిష్యుపేపర్ తో తుడిస్తే పూర్తిగా పోతుంది. వాసన కూడా రాదు.
 • ఉప్పు నీళ్ళతో గాజు సామానులు కడిగితే తళ తళ మెరుస్తాయి.
 • కార్పెట్ మిద మొక్కజొన్న పిండి చల్లి తరువాత వ్యాక్యూమ్ క్లినర్ తో శుభ్రం చేస్తే దుమ్ము పూర్తిగా పోయి కొత్తదానిలా మెరుస్తుంది.
 • గోరింటాకు మరకలు పడిన బట్టలను పాలలో నానపెట్టి ఉతికితే మరకలు పూర్తిగా తొలగిపోతాయి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE